దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల జాబితాలో ఐఐటి మద్రాస్ అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా ఐదో సంవత్సరం ఐఐటి మద్రాస్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకోగా, రెండు, మూడు స్థానాలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి) బెంగళూరు, ఐఐటి-ఢిల్లీ దక్కించుకున్నాయి.
నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) కింద కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ రూపొందించిన ఇండియన్ ర్యాంకింగ్స్ రిపోర్టు-2023ను కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ సోమవారం విడుదల చేశారు
టాప్ 10 విద్యా సంస్థలు (ఓవరాల్): 1. ఐఐటి మద్రాస్, 2. ఐఐఎస్సి బెంగళూరు, 3. ఐఐటి ఢిల్లీ, 4. ఐఐటి ముంబయి, 5. ఐఐటి కాన్పూర్, 6. ఎయిమ్స్ ఢిల్లీ 7. ఐఐటి ఖరగ్‌పూర్, 8. ఐఐటి రూర్కే, 9. ఐఐటి గౌహతి, 10. జెఎన్‌యు ఢిల్లీ
ఇలా ఉండగా, తెలంగాణాలో 14వ ర్యాంకులో ఐఐటి హైదరాబాద్, 20వ ర్యాంకులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, 53వ ర్యాంకులో ఎన్ఐటి వరంగల్, 64వ ర్యాంకులో ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కెఎల్ యూనివర్సిటీ 50, ఆంధ్రా యూనివర్సిటీ 74వ ర్యాంకులో నిలిచాయి.
బెంగళూరులోని ఐఐఎస్సి ఉత్తమ యూనివర్సిటీగా నిలిచింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. జాదవ్‌పూర్ యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సియు) పదో స్థానంతో సరిపెట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కెఎల్ యూనివర్సిటీకి 28, ఆంధ్రా యూనివర్సిటీకి 43, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి 60, విజ్ఞాన యూనివర్సిటీకి 75వ ర్యాంకు వచ్చింది. తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీకి 36, ట్రిపుల్ ఐటి, హైదారాబాద్‌కు 84వ ర్యాంకులు వచ్చాయి.
ఇంజినీరింగ్ విభాగంలో మొదటి స్థానాన్ని ఐఐటి (మద్రాస్) కైవసం చేసుకుంది. ఐఐటి ఢిల్లీ, ఐఐటి ముంబయి రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 8వ స్థానంలో ఐఐటి (హైదరాబాద్), 21వ స్థానంలో ఎన్ఐటి (వరంగల్), 55వ ర్యాంకకుో ట్రిపుల్ ఐటి (హైదరాబాద్), 71వ ర్యాంకులో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, 83వ ర్యాంకులో జెఎన్టియు హైదరాబాద్, 98వ ర్యాంకులో ఎస్ఆర్ యూనివర్సిటీ (వరంగల్) నిలిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కెఎల్ యూనివర్సిటీ 44, ఐఐటి, తిరుపతి 59, విజ్ఞాన్ యూనివర్సిటీ 85, ఎయు ఇంజినీరింగ్ కాలేజ్ 94వ ర్యాంకులో నిలిచాయి.
మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్ తొలి స్థానంలో నిలవగా, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కొజికోడ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మెడికల్ విభాగంలో ఎయిమ్స్ ఢిల్లీ, మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (చండీగఢ్), క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (వెల్లూర్) మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
ఫార్మసీ విభాగంలో హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మొదటి స్థానంలో నిలిచింది. జామియా హమ్దర్ద్, బిట్స్ పిలానీ రెండు, మూడు స్థానాలు సాధించాయి. 22వ ర్యాంకులో ఎయు కాలేజీ ఆఫ్ ఫార్మసీ (విశాఖపట్నం) నిలిచింది.
న్యాయ విద్యలో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని ‘నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా’ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. కాగా ర్యాంకింగ్ కోసం గతేడాది 7,254 దరఖాస్తులు రాగా.. ఈ ఏడాది 8,686 దరఖాస్తులు వచ్చాయి.
ఎన్ఐఆర్ఎఫ్ – 2023 ర్యాంకింగ్స్‌లో జాతీయ స్థాయిలో విశ్వవిద్యాలయాల విభాగంలో విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం 43వ స్థానం సాధించింది. కళాశాలల విభాగంలో ఎయు ఫార్మసీ కళాశాల 22వ స్థానం, ఎయు ఇంజనీరింగ్ కళాశాల 94వ స్థానం పొందాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో ఎయు ప్రథమ స్థానంలో నిలిచింది.
దేశ వ్యాప్తంగా 2,478 విద్యా సంస్థలు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో భాగం కాగా వాటితో ఎయు పోటీపడి ఈ అత్యుత్తమ స్థానం దక్కించుకుంది. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో నాక్ చైర్మన్ సహస్రబుద్దే నుంచి ఎస్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ధ్రువపత్రాలను ఎయు రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్ స్వీకరించారు.