గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలయిన పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో అత్యునత సేవలందించిన వారిని ఈ అవార్డుల కోసం ఎంపిక చేసింది. ఈ ఏడాదికి గాను మొత్తం 106 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించగా, అందు లో ఆరుగురిని పద్మ విభూషణ్‌కు, 9 మందిని పద్మభూషణ్‌కు, 91 మంది ని పద్మశ్రీ అవార్డుల కోసం ఎంపిక చేసింది.
గత ఏడాది మే 1నుంచి సెప్టెంబర్ 15వరకు నామినేషన్లు స్వీకరించిన కేంద్రం.. రిపబ్లిక్ వేడుకల సందర్భంగా బుధవారం రాత్రి పురస్కారాలను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలనుంచి మొత్తం 12 మందికి పద్మ అవార్డులు లభించాయి.
తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక విభాగంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి; కమలేశ్ డి పటేల్ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. అలాగే, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణిని పద్మశ్రీ వరించింది.
తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన వారిలో మోదడుగు విజయ్ గుప్తా(సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంల); హనుమంతరావు పసుపులేటి(వైద్యం), బి.రామకృష్ణారెడ్డి (సాహిత్యం, విద్య) ఉండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి (కళలు)గణేశ్ నాగప్ప కృష్ణరాజనగర; అబ్బారెడ్డి నాగేశ్వరరావు; (సైన్స్ అండ్ ఇంజినీరింగ్); సీవీ రాజు, కోట సచ్చిదానంద శాస్త్రి (ఆర్ట్); ;సంకురాత్రి చంద్రశేఖర్ (సామాజిక సేవ); ప్రకాశ్ చంద్రసూద్ (సాహిత్యం, విద్య విభాగంలో) లు ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన లింగ్విస్టిక్ ప్రొఫెసర్ బి.రామకృష్ణారెడ్డికి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.లిటరేచర్, ఎడ్యుకేషన్(లింగ్విస్టిక్) విభాగంలో పద్మశ్రీ లభించింది. గిరిజన, దక్షిణాది భాషలకు ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. కువి,మందా, కుయ్ వంటి గిరిజన, దక్షిణాది భాషల పరిరక్షణకు ఆయన విశేష కృషి చేశారు. గిరిజన భాషలను ఇతర భాషలతో కలుపుతూ సాంస్కృతిక వారధిని నిర్మించేందుకు దశాబ్దాల పాటు శ్రమించారు. మాండా – ఇంగ్లీష్ డిక్షనరీని, కువి ఒరియా ఇంగ్లీష్ డిక్చనరీని రూపొందించారు. మరో ఐదు పుస్తకాలను సహ రచయితగా ఉన్నారు.