మొన్న హైదరాబాద్ లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణాలో రాబోయెడిది బిజెపి ప్రభుత్వమే అంటూ కేంద్ర నాయకులు అందరూ ధీమా వ్యక్తం చేసినా వారి దృష్టి అంతా ఈ రాష్ట్రం నుండి అత్యధికంగా లోక్‌సభ సీట్లు గెల్చుకోవడం పైననే అన్నట్లు కనిపిస్తున్నది. 2019లో తెలంగాణాలో నాలుగు సీట్లను బిజెపి అనూహ్యంగా గెల్చుకున్నా, అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క సీట్ మాత్రమే గెల్చుకోవడం గమనార్హం. అందుకనే రాష్ట్రంలో ఎన్నికలకు సిద్ధం అయ్యే ఎత్తుగడలు అన్నింటిని కేంద్ర నాయకత్వమే స్వయంగా రూపొందిస్తూ, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కేంద్ర మంత్రులను క్షేత్రస్థాయిలోకి పంపేందుకు ప్రణాళికలు రూపొందించారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందు పార్టీ స్థితిగతులను అంచనా వేసేందుకు కేంద్ర మంత్రులు సహా కీలక నేతలను తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు పంపిన కమలం పార్టీ.. ఈసారి లోక్‌సభ నియోజకవర్గాల వారీగా రంగంలోకి దిగుతోంది. కేంద్ర మంత్రుల్ని పార్టీ బలహీనంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటింప జేయడం (పార్లమెంట్ ప్రవాసీ యోజన) ద్వారా బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ,…
Author: Editor's Desk
ఇద్దరు కేంద్ర మంత్రుల రాజ్యసభ పదవీకాలం నేటితో ముగియనున్నది. నేడు జరిగే మంత్రివర్గ సమావేశమే వారికి చివరి సమావేశం అవుతుందా? లేదా ఎంపీ కాకపోయినా ఆరు నెలల పాటు మంత్రివర్గంలో కొనసాగే అవకాశం వారికి ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తారా? లేదా వారిని ప్రస్తుతం ఉన్న ఖాళీలతో రాజ్యసభకు నామినేట్ చేస్తారా? తెలియవలసి ఉంది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ (బిజెపి), కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ (జెడియు) ల రాజ్యసభ పదవీకాలాన్ని జూలై 7న ముగియనుంది. బిజెపి, జెడియు పార్టీలు వారిని మళ్లీ రాజ్యసభకు ఇటీవల జరిగిన ఎన్నికలలో తిరిగి పంపలేదు. జులై 7తో పదవీకాలం ముగిసిన ఆరు నెలల్లో ఎంపిలుగా ఎన్నిక కాకపోతే మంత్రులిద్దరూ కేబినెట్ సీట్లు కోల్పోతారు. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని బిజెపి మళ్లీ నామినేట్ చేయక పోవడంతో ఆయనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బిజెపి నామినేట్ చేయనున్నాదనే వార్తాకథనాలు వస్తున్నాయి. మరోవంక, …
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఇప్పుడు ద్రవ్యోల్బణం మరో సమస్యగా తయారైంది. ఇప్పటికే ఇంధన కొనుగోళ్లకు అవసరమైన డాలర్లు అయిపోయాయి. ఉద్యోగులకు జీతాలు, ఇతర ప్రభుత్వ ఖర్చుల కోసం కరెన్సీ ముద్రణ మాత్రం కొనసాగుతోంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం భారీగా పెరిగి 60 శాతానికి చేరడంతో దీనిని కట్టడి చేయడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. ఆసియాలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న దేశం ఇదే. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలోకి నగదును చొప్పించడం ఆపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కొత్త కరెన్సీని ముంద్రించడం నిలిపివేయాలనే నిర్ణయాన్ని శ్రీలంక ప్రభుత్వం తీసుకుంది. మరోవైపు దివాలా అంచుకు చేరడంతో బెయిలౌట్ కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) శ్రీలంక మధ్య జరుగుతున్న చర్చలు కఠినంగా సాగుతున్నాయి. మంగళవారం ప్రధాని రణీల్ విక్రమ సింఘే పార్లమెంట్లో మాట్లాడుతూ దేశ ద్రవ్యపరపతి విధాన సమీక్ష గురువారం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ చర్చలు స్టాఫ్ లెవల్ అగ్రిమెంట్స్థాయికి చేరాలన్నా ఆగస్టు వరకు సమయం పట్టవచ్చని…
ఆహార భద్రత చట్టం అమలులో ఒడిషా అగ్రస్థానంలో నిలివగా, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. మంగళవారం ఢిల్లీలో జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఎ) రాష్ట్రాల ర్యాంకింగ్ ఇండెక్స్‌ను కేంద్ర వినియోగదారు వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రి పియూష్ గోయల్ విడుదల చేశారు. ఎన్ఎఫ్ఎస్ఎ అమలు తీరు, పురోగతి, వివిధ సంస్కరణలు ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించారు. ఆహార భద్రత అమలులో జనరల్ కేటగిరీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఇండెక్స్‌లో స్కోరు 0.794తో ఏపి మూడోస్థానంలో నిలిచింది. 0.836 స్కోరుతో తొలి స్థానంలో ఒరిస్సా, 0.797 స్కోరుతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. 0.743 స్కోరుతో తెలంగాణ 12వ స్థానంలో నిలిచింది. గోవా (0.631 స్కోర్) చివరి స్థానంలో నిలిచింది. స్పెషల్ కేటగిరీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విభాగంలో త్రిపుర (0.788 స్కోర్), హిమాచల్ ప్రదేశ్ (0.758 స్కోర్), సిక్కిం (0.710 స్కోర్)లు మొదటి స్థానంలో నిలిచాయి. లడఖ్…
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత, ఎంపీ దిలీప్ ఘోష్ మద్దతు పలికారు. నూపుర్ శర్మ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులను తప్పుబట్టారు. హింసాత్మక ఘటనల వెనుకున్న భావజాలాన్ని ఆయన విమర్శించారు. స్వాతంత్ర్యానికి పూర్వం కూడా ఈ తరహా అల్లర్లు జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, అయితే హింసాత్మక ఘటనల వెనుకున్న సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ప్రపంచం భయపడిందని ఆయన పేర్కొన్నారు. నూపుర్ శర్మ చెప్పినది తప్పని భావించేవారు వచ్చి వాదన చేయాలని, టీవీ డిబేట్లో కారణాలు చెప్పాలని ఆయన హితవు చెప్పారు. నూపుర్ శర్మ మాట్లాడిన దాంట్లో తప్పేంటో చెప్పకుండా.. కత్తులు దూస్తున్నారని దిలీప్ ఘోష్ ధ్వజమెత్తారు. వివాదాస్పద ‘కాళీ’ పోస్టర్‌పై ప్రశ్నించగా తాము ప్రగతిశీల, సెక్యూలర్ వ్యక్తులమని చెప్పుకునేందుకు కొంతమంది హిందుత్వాన్ని తిడుతుంటారని దిలీప్ ఘోష్ ఎద్దేవా చేశారు. కాళీ మాత సిగరెట్…
ఒక వంక తెలంగాణాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతూ, ఎన్నికల వాతావరణంలో ప్రధాన రాజకీయ పక్షాలు మునిగిపోయి ఉండగా, అధికార పక్షం టీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులు మాత్రం చాలా మంది విదేశీ పర్యటనలలో తీరిక లేకుండా ఉన్నారు. రాష్ట్రం నుంచి సగం మందికి పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు విదేశీ పర్యటనలు చేస్తున్నారు. గత నెల రోజుల వ్యవధిలో మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, కేటీఆర్, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి, తలసాని, మరికొంతమంది ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ కవిత, పలువురు ఎంపీలు నాటా, ఆట సభలకు వెళ్లారు. అటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి కూడా అమెరికా వెళ్లి వచ్చారు. ఒకేసారి ఇంతమంది విదేశీ పర్యటనలు చేస్తుండటం విస్మయం కలిగిస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర ముఖ్యనాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇలాంటి సమయంలో ప్రతి పక్షాలను కార్నర్ చేయాల్సిన మంత్రులు, ముఖ్య నేతలు మాత్రం ఫారిన్…
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజుపై తెలంగాణలో పోలీసు కేసు నమోదైంది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రఘురామరాజుపై కేసు నమోదు చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ బాషాపై ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపించారు. సోమవారం ఉదయం విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేసి, కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు. “నన్ను చంపటానికి వచ్చావా?” అంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనపై దాడి చేశారని కానిస్టేబుల్ ఫరూక్ ఆరోపించారు. తన కాళ్లు, చేతులు కట్టేయమని తన మనుషులకు చెప్పినట్లు తెలిపారు. కరెంటు షాక్ ఇవ్వాలంటూ తన కుమారుడిని ఆదేశించారని,. తన జుట్టు పట్టుకుని తలను గోడకేసి కొట్టారని తెలిపారు. “రఘురామ వెళ్లాక రంగంలోకి దిగిన ఆయన కుమారుడు భరత్ సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను రెచ్చగొట్టాడు. మా ఇంట్లో తింటూ, నెలనెలా మామూళ్లు తీసుకుంటూ వాడిని చిన్నగా కొడతారేంటంటూ మాట్లాడాడు.…
బిజెపి నుంచి సస్పెండయిన నూపుర్ శర్మపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ విశ్రాంత న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు బహిరంగ లేఖ రాశారు. అత్యున్నత న్యాయస్థానం ‘లక్ష్మణ రేఖ’ను దాటిందని, తక్షణమే అత్యవసర దిద్దుబాటు చర్యలు చేపట్టాలని వారు పిలుపునిచ్చారు. వ్యవస్థలన్నీ రాజ్యాంగానికి అనుగుణంగా తమ కర్తవ్యాలను నిర్వహించినపుడు మాత్రమే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని స్పష్టం చేశారు. నూపుర్ శర్మ మే నెలాఖరులో ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై ముస్లింలు వివిధ రాష్ట్రాల్లో ఆమెపై కేసులు దాఖలు చేశారు. ఈ కేసులన్నిటినీ ఢిల్లీలోనే విచారించాలని కోరుతూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఇటీవల చేసిన వ్యాఖ్యలు కొన్ని వర్గాలకు ఆగ్రహం తెప్పించాయి. ఆమె వాచాలత్వంతో మాట్లాడారని ధర్మాసనం పేర్కొంటూ దేశంలో జరుగుతున్నదానికి పూర్తి బాధ్యత ఆమెదేనని పేర్కొంది. యావత్తు దేశానికి ఆమె క్షమాపణ చెప్పాలని సూచించింది. నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని తప్పుబట్టింది. జస్టిస్ సూర్యకాంత్,…
సంచలనం సృష్టించిన అమరావతి కెమిస్ట్ ఉమేష్ హత్య కేసు నిందితులు ఏడుగురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు మంగళవారం తెలిపారు. అమరావతి కోర్టు ముందు వీరిని హాజరు పరిచామని చెప్పారు. నాలుగు రోజుల ట్రాన్సిస్ రిమాండ్‌కు కోర్టు ఆదేశించింది. మహారాష్ట్రలోని అమరావతిలో జూన్ 21వ తేదీ రాత్రి 10-10.30 గంటల మధ్యలో ముగ్గురు వ్యక్తులు ఉమేష్‌పై కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఉమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రాజస్తాన్‌లోని ఉదయ్ పూర్లో టైలర్ కన్హయ్యలాల్ దారుణ హత్యకు వారం రోజుల ముందు అమరావతి కెమిస్ట్ హత్యా ఘటన జరిగింది. అమరావతిలో ఉమేష్ మెడికల్ షాపును నడుపుతున్నాడు. నూపుర్ శర్మ వ్యాఖ్యలకు మద్దతుగా ఒక పోస్ట్‌ను ఆయన వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశారు. ఆ పోస్టును తన కస్టమర్లకు షేర్ చేశారని, పొరపాటుగా కొందరు ముస్లిం సభ్యులుకు కూడా పోస్ట్ చేశారా అన్న కోణంలో…
జూన్ 30న ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర మంగళవారం ఉదయం ప్రతికూల వాతావరణం కారణంగా పహల్గామ్ మార్గంలో తాత్కాలికంగా నిలిపివేశారు. పహల్గామ్లోని నున్వాన్ బేస్ క్యాంప్ నుండి సహజంగా ఏర్పడిన మంచు-శివలింగం ఉన్న గుహ మందిరం వైపు యాత్రికులు వెళ్లడానికి అనుమతించబోమని అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్‌లోని ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశ నలుమూల నుంచి భక్తులు వెళ్తుంటారు. అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్లోని నున్వాన్ క్యాంప్, గందర్బల్ జిల్లా బాల్టాల్ క్యాంప్ నుంచి ఈ ఏడాది అమర్నాథ్ యాత్రను ప్రారంభించారు. ఆగస్టు 11న రాఖీ పౌర్ణమి రోజున అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లోని పహల్గామ్లోని నున్వాన్ , సెంట్రల్ కాశ్మీర్‌లోని గందర్బల్ జిల్లాలో బల్తాల్ క్యాంప్‌లోని జంట బేస్ క్యాంప్‌ల నుండి వార్షిక 43-రోజుల తీర్థయాత్ర నిర్వహిస్తారు. మంగళవారం ఉదయం, 6,300 మందికి పైగా అమర్నాథ్ యాత్రికుల ఆరవ బ్యాచ్ మంగళవారం దక్షిణ కాశ్మీర్‌లోని 3,880 మీటర్ల ఎత్తైన అమర్నాథ్ గుహ పుణ్యక్షేత్రానికి…