Author: Editor's Desk, Tattva News

న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించేవారికి డబ్బు, భాష అడ్డంకి కారాదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. ఆల్‌ ఇండియా జ్యుడీషియల్‌ సర్వీసెస్‌ను తీసుకురావాల్సిన అవసరముందని ఆమె సూచించారు. ఆదివారం సుప్రీంకోర్టు ఆవరణలో అంబేద్కర్‌ విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘ రాజ్యాంగంలో న్యాయవ్యవస్థకు ఉన్న ప్రాముఖ్యత అద్వితీయమైనది. బెంచ్ అండ్ బార్‌లో అన్ని వర్గాల వారికి అవకాశం కల్పిస్తే సరైన న్యాయం అందించడం సాధ్యమవుతుంది.ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీస్‌ను ఏర్పాటు చేయడం మరింత మెరుగైన న్యాయాన్ని అందించడానికి తోడ్పడుతుంది’ అని ఆమె చెప్పారు.  అంతేకాకుండా దీన్ని ఏర్పాటు చేసి అన్ని వర్గాలకు చెందిన యువతకు అవకాశం కల్పించవచ్చని రాష్త్రపతి చెప్పారు.  ప్రతిభావంతమైన యువతను దీనికి ఎంపిక చేసి న్యాయమూర్తులుగా తీర్చిదిద్దవచ్చని పేర్కొంటూ ఇది కింది స్థాయినుంచి ఉన్నతస్థాయి వరకు వారి ప్రతిభను పెంపొందించగలదని ఆమె తెలిపారు.…

Read More

ముంబయిపై దశాబ్దం కిందట జరిగిన ఉగ్రదాడిని తాను మర్చిపోలేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆదివారం మన్ కీ బాత్ లో నవంబర్ 26, 2008 ముంబయిలో జరిగిన ఉగ్రదాడి ఘటనని ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం మోదీ  మాట్లాడుతూ “ముంబయి ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య. ఉగ్రవాదులు అప్పట్లో దేశాన్ని వణికించారు. ప్రస్తుతం భారత్ వారిని అణచివేయడానికి అన్ని కఠిన చర్యలు చేపట్టింది” అని చెప్పారు.  ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ ముంబయి దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు.  ఆ రోజు 10 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు విధ్వంసకర ఆయుధాలతో ముంబయిలో వరుస దాడులు చేశారు. ఈ దాడులు పౌరులు, భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్నాయి.  అరేబియా సముద్రం మీదుగా నగరంలోకి చొరబడిన ఉగ్రవాదులు 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మందిని హతమార్చగా, వందలాది మంది గాయపడ్డారు. కోట్ల రూపాయల…

Read More

టాప్‌-3 బ్యాటర్లు హాఫ్‌సెంచరీలతో రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియాపై వరుసగా రెండో టీ20లో టీమ్‌ఇండియా విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ పరాజయాన్ని పక్కనపెట్టి యువ ఆటగాళ్లతో బరిలోకి దిగిన భారత జట్టు అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో దుమ్మురేపింది. యశస్వి జైస్వాల్‌ ఇచ్చిన మెరుపు ఆరంభాన్ని రుతురాజ్‌, ఇషాన్‌ కొనసాగించగా.. ఆఖర్లో రింకూసింగ్‌ పిడుగుల్లాంటి షాట్లతో కంగారూలపై విరుచుకుపడ్డాడు. గత మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న బౌలర్లు.. ఈ సారి మెరుగైన ప్రదర్శన కనబర్చడంతో టీమ్‌ఇండియా సిరీస్‌లో 2-0తో ముందంజ వేసింది. తిరువనంతపురంలో ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత్ 44 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ (53), రుతురాజ్ గైక్వాడ్ (58), ఇషాన్ కిషన్ (52) అర్ధ శతకాలకు తోడు రింకూ సింగ్ (9 బంతుల్లో 31 రన్స్) మెరుపు బ్యాటింగ్‍తో ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు…

Read More

సిగరెట్లు, బీడీలు, ఇంకా పొగాకు, పొగాకు ఉత్పత్తులపై ఆరోగ్య సుంకం పెంపు దిశగా కేంద్రం ఆలోచించటం ముదావహమని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహిత మాచన రఘునందన్ తెలిపారు. సిగరెట్ల తో పాటు బీడీలు,ఇతర పొగాకు ఉత్పత్తులపై హెల్త్ ట్యాక్స్ పెంచాలని, హెల్త్ ట్యాక్స్ విధించాలని కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నది. ఈ విషయమై మాట్లాడుతూ.. హెల్త్ టాక్స్ విధింపు,పెంపు అనే నిర్ణయాలతో పాటు పొగాకు, పొగాకు ఉత్పత్తులను పాఠశాలలు, కళాశాలలు ఉన్న ప్రాతంలో అరకిలోమీటరు వరకు విక్రయించకుండా ఆంక్షల్ని విధించి, అవి పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని ఆయన అభ్యర్ధించారు. “ప్రధాని నరేంద్ర మోదీ బాలలతో, విద్యార్థులతో కలివిడిగా ఆత్మీయంగా మాట్లాడుతున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు ఆన్న విషయం దృష్టి లో పెట్టుకుని స్కూళ్లు, కాలేజీ లు ఉన్న చోట అర కిలోమీటర్ దూరం వరకు పొగాకు, పొగాకు ఉత్పత్తుల విక్రయం పై నిషేధం విధిస్తే భవిష్యత్ భారతం…

Read More

చైనాలో తీవ్రస్థాయి న్యూమోనియా నేపథ్యంలో రాష్ట్రాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలని కేంద్రం అప్రమత్తం చేసింది. ఎక్కడైనా శ్వాసకోశ వ్యాధుల తీవ్రత ఉంటే వెంటనే వాటిపై నివారణ చర్యలు ఉధృతం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఉత్తర చైనాలో ఇప్పుడు పిల్లల్లో తలెత్తిన న్యూమోనియా వైరస్ కారకం అనే వార్త ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆందోలన కలిగిస్తున్నది. చైనా వైరస్ దశలో రాష్ట్రాలు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు ప్రజా ఆరోగ్య, చికిత్సల పరిస్థితిని సమీక్షించుకుంటూ, సన్నద్ధతతను పెంపొందించుకోవల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం అధికారిక ప్రకటన వెలువరించింది. ఇప్పటికిప్పుడు చైనా న్యూమోనియాతో భారతదేశానికి పెద్దగా ముప్పేమీ లేదని వైద్య ప్రముఖులు తెలిపారు. కానీ ఎటువంటి ఉపేక్ష అయినా అది పరిస్థితిని విషమింపచేస్తుందని హెచ్చరించారు. దీనితో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది. అత్యంత ఆద్యంత జాగ్రత్త చర్యలలో భాగంగా కేంద్రం వివిధ స్థాయిల్లో వైరస్ ముప్పు తట్టుకునే ముందస్తు జాగ్రత్తలపై సమీక్షించుకుంటుందని,…

Read More

ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. ఆదివారం నాడు తూప్రాన్‌‌లో ఎన్నికల ప్రచార బహిరంగసభలో మాట్లాడుతూ గజ్వేల్‌లో పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌ను చూసి కేసీఆర్‌ భయపడ్డారని చెప్పారు.‘‘తెలంగాణ ఈసారి ఓ కొత్త సంకల్పం కనిపిస్తోంది. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవాలని సంకల్పం మొదలైంది” అని చెప్పారు.  భూ నిర్వాసితులను రోడ్డునపడేసిన కేసీఆర్‌ను ప్రజలు ఎప్పటికీ క్షమించరని ప్రధాని స్పష్టం చేశారు. ప్రజలను కలవని సీఎం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. సచివాలయానికి రాని సీఎం అవసరమా? ఫాంహౌస్‌లో ఉండే సీఎం మనకు అవసరమా? అంటూ నిలదీశారు.  కాంగ్రెస్‌, బిఆర్ఎస్ వారసత్వ రాజకీయాలతో వ్యవస్థ నాశనమైందని మండిపడుతూ కాంగ్రెస్‌, బిఆర్ఎస్ ఒక్కటే అని స్పష్టం చేశారు. ఇద్దరితో జాగ్రత్తగా ఉండాలని ప్రధాని ప్రజలను హెచ్చరించారు. బీసీల్లో ప్రతిభావంతులకు న్యాయం జరగడం లేదని పేర్కొంటూ సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం అని ప్రధాని మోదీ…

Read More

తెలంగాణాలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వికారాబాద్ జిల్లాలోని కొండగల్‌ కు చెందిన బీఆర్ఎస్ శాసన సభ్యుడు పట్నం నరేందర్ రెడ్డిపై కేసు నమోదైంది. హత్యాయత్నం, కిడ్నాప్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, మరో ఆరు మందిపై ఈ కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు పెట్టారు. ఇందులో ఏ1గా పట్నం నరేందర్ రెడ్డి పేరును నమోదు చేశారు. కోస్గిలో కూర నరేష్ అనే వ్యక్తిపై దాడి చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. కోస్గిలో తమ కారుకు సైడ్ ఇవ్వలేదనే కారణంతో బైక్‌పై వెళ్తోన్న కూర నరేష్‌పై పట్నం నరేందర్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్, వారి అనుచరులు కర్రలతో దాడి చేసి చితగ్గొట్టినట్లు ఫిర్యాదులో పొందుపరిచారు. తనను హత్య చేయడానికి ప్రయత్నించారని బాధితుడు పేర్కొన్నాడు.…

Read More

ఈశాన్య రుతుపవనాల నేపథ్యంలో థాయ్‌లాండ్‌ మీదుగా వచ్చే ఉపరితల ఆవర్తనం ఆదివారం దక్షిణ అండమాన్‌ సముద్రంలోకి ప్రవేశించనుంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది.  ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 29 నాటికి వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం, ఇది తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశం ఉందని పేర్కొంది. బంగ్లాదేశ్‌ దిశగా పయనించే సమయంలో తుఫాన్‌ ఉత్తర బంగాళాఖాతంలోకి ప్రవేశించి, బలహీన పడుతుందని చెప్పింది.  ఈ తుఫాను దక్షిణ కోస్తా… తమిళనాడుకు సమీపంగా వచ్చి దిశ మార్చుకుని బంగ్లాదేశ్‌ వైపు వెళుతుందని అంచనా వేశారు. దీని ప్రభావంతో నవంబరు 26 నుంచి 28 వరకూ అండమాన్ నికోబార్ దీవుల్లోని చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.  ఆగ్నేయ బంగాళాఖాతం దానికి అనుకుని ఉన్న…

Read More

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు శనివారం ప్రశాంతగా ముగిసాయి. భారీగా పోలింగ్‌ నమోదైంది. సుమారు 75 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల కమిషన్‌ అధికారులు తెలిపారు. గత ఏడాదికంటే సుమారు 1 శాతం ఎక్కువగా పోలింగ్ జరగడం గమనార్హం. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, గవర్నర్‌ కలరాజ్‌ మిశ్రా, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, బీజేపీ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, ప్రతిపక్ష రాజేంద్ర రాథోర్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోవింగ్‌ సింగ్‌ డోటస్రా, విధాన సభ స్పీకర్‌, కాంగ్రెస్‌ నేత సీపీ జోషి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అమ్రారామ్‌ తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.  శనివారం మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకు గాను 199 స్థానాల్లో పోలింగ్‌ జరిగింది. ఒకటి, రెండు రాళ్లు రువ్వుకున్న సంఘటనలు మినహా…

Read More

కేరళలోని కోచ్చి విశ్వవిద్యాలయంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. క్యాంపస్‌లో సాయంత్రం టెక్‌ఫెస్ట్‌ నిర్వహిస్తుండగా వర్షం కురియటంతో తొక్కిసలాట జరిగి నలుగురు విద్యార్థులు చనిపోయారు. మరో 65 మంది గాయ పడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు ఉన్నారు. మృతులను అన్నా రుఫ్తా, సారా థామస్‌, అతుల్‌ తంబి, అల్బిన్‌ జోసఫ్‌గా గుర్తించారు. క్షతగాత్రులను కలమస్సేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఓపెన్‌ ఎయిర్‌ ఆడిటోరియంలో జరిగిన టెక్‌ ఫెస్ట్‌ కార్యక్రమంలో రాత్రి 7 గంటలకు వర్షం కురవడంతో విద్యార్థులు లోపలి వైపు ఒక్కసారిగా దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ప్రముఖ ప్లేబ్యాక్‌ సింగర్‌ నిఖితా గాంధీ లైవ్‌ కాన్సర్ట్‌ను వీక్షించేందుకు విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులతో అత్యున్నత సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన…

Read More