కర్ణాటకలో మత మార్పిడిలను నిరోధించే ముసాయిదా బిల్లు, కర్ణాటక ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలిజన్ బిల్ 2021 సిద్దమైనది. ఈ బిల్లు ప్రకాటం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనర్లు, మహిళలకు చెందిన వ్యక్తులను బలవంతంగా మతమార్పిడికి గురి చేస్తే గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షను ప్రతిపాదించింది. ప్రతిపాదిత చట్టం చెల్లుబాటును పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని రోజులుగా వరుస సమావేశాలను నిర్వహిస్తోంది. బుధవారం రాత్రి జరిగిన తన లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో, ప్రస్తుత సెషన్‌లోనే బిల్లును సభలో ప్రవేశపెట్టాలని బిజెపి నిర్ణయించింది. ప్రతిపాదిత కొత్త చట్టానికి తుది మెరుగులు దిద్దేందుకు గురువారం రాష్ట్ర హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర, ఈ బిల్లును రూపొందిస్తున్న చేస్తున్న మంత్రిత్వ శాఖకు చెందిన న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి జేసీ మధుస్వామితో సమావేశమయ్యారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, పార్లమెంటరీ వ్యవహారాలు, న్యాయశాఖ కార్యదర్శిలతో నిర్వహించిన సమావేశంలో…
Author: Editor's Desk, Tattva News
గ్రామాల్లో పని చేస్తున్న వ్యవసాయ విస్తరణాధికారుల (ఎఇఒ) పదోన్నతులపై వ్యాజ్యాల్లో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డ వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆ శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్‌లను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఈ నోటీసులు వ్యవసాయ శాఖలో కలకలం రేపుతున్నాయి. జనవరి 7 ఉదయం పదిన్నరకు న్యాయస్థానానికి రావాలని, అప్పటి నుండి ఈ కేసు తేలేంత వరకు ప్రతి రోజూ తమ ఎదుట హాజరు కావాలని కోర్టు ధిక్కరణ నోటీసులిచ్చింది. అధికారులకు నోటీసులు అందించేలా చర్యలు చేపట్టాలని గుంటూరు జిల్లా కోర్టును ఆదేశించింది. ధిక్కరణ నోటీసులపై న్యాయస్థానం ఈ నెల 3న ఆదేశాలివ్వగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఇదిలా ఉండగా పదోన్నతులపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు అర్హులైన తమకు అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించిన ఎఇఒ ముద్దపప్పు వేణుగోపాల్ కేసు ఉపసంహరించుకోవాలని ఉన్నతాధికారులు తీవ్ర స్థాయిలో మానసికంగా వేధిస్తున్నారని సమాచారం.…
ప్రపంచవ్యాప్తంగా పుట్టుకొస్తున్న కరోనా కొత్త వేరియంట్‌లు పలు దేశాలపై విరుచుకుపడుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ప్రజలు ఈ వేరియంట్‌ల బారిన పడుతూనే ఉన్నారు. దానితో ప్రస్తుతమున్న కరోనా వ్యాక్సిన్‌లు కొత్త వేరియంట్‌లపై ఎందుకు సమర్థవంతంగా పనిచేయడం లేదనే అంశంపై అమెరికా శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. కరోనా వేరియంట్ ఏదైనా ఒకేలా, అత్యంత సామర్థ్యంతో పనిచేసే కొత్త వ్యాక్సిన్‌ను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ (యూసిఎల్‌ఎ) శాస్త్రవేత్తలు రూపొందించారు. కరోనా వైరస్‌పై ఉండే కొమ్ముపై కాకుండా, వైరస్ మ్యుటేషన్‌లకు కారణమయ్యే వైరల్ పాలిమరేస్ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యాక్సిన్‌ను రూపొందించే కొత్త విధానాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కాగా, ప్రస్తుతమున్న కరోనా వ్యాక్సిన్‌లన్నీ కూడా వైరస్ స్పైక్ ప్రోటీన్‌తో తయారైనవే. దీంతో శరీరంలోకి వైరస్ ప్రవేశించగానే వ్యాక్సిన్‌లు దాన్ని గుర్తించి, రోగనిరోధక శక్తిని అప్రమత్తం చేస్తాయి. అయితే వైరస్ స్పైక్ ప్రొటీన్‌లో మార్పుల కారణంగా డెల్టా, ఒమిక్రాన్ వంటి వేరియంట్‌లు వచ్చాయని, ప్రస్తుతమున్న…
2012 నాటి షీనా బోరా హత్య కేసు నిందితురాలు, మీడియా మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంద్రాణి ముఖర్జీ తన కుమార్తె బోరా ఇంకా సజీవంగా ఉన్నదంటూ సరికొత్త సంచలనం సృష్టించారు. ఆ మేరకు ఇంద్రాణి సిబిఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. కాశ్మీర్‌లో షీనా బోరాను కలిశానని జైలులో ఉన్న తనను ఇటీవల ఓ మహిళ కనిపించి చెప్పిందని పేఆమె ర్కొన్నారు. కాశ్మీర్‌లో షీనా బోరాను వెతకాలని ఆమె సిబిఐని కోరారు. లేఖతో పాటు సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇది త్వరలో విచారణకు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. షీనా బోరా హత్య కేసులో 2015లో అరెస్టైన నాటి నుండి ముంబయిలోని బైకుల్లా జైలులోఉన్నారు. బెయిల్ దరఖాస్తు చేసుకోగా.. గత నెలలో ముంబయి హైకోర్టు తిరస్కరించింది. త్వరలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి. ఇంద్రాణి ముఖర్జీ డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్ గన్‌తో పట్టుబడటంతో షీనా బోరా హత్య ఉదంతం బయటకు వచ్చింది.…
హెలికాఫ్టర్ ప్రమాదంలో గత వారం దుర్మరణం చేసింది జనరల్ బిపిన్ రావత్ భారత సైన్యంలో పనిచేసిన 42 ఏళ్లలో కూడా అత్యధిక కాలం పోరాటాలు జరుగుతున్న ప్రాంతాలలోనే పనిచేశారు. ముఖ్యంగా భారత్, చైనా సరిహద్దులలో వివిధ హోదాలలో, దాదాపు అన్ని ప్రాంతాలలో పనిచేశారు. అటువంటి అనుభవం ఉన్న సైనికాధికారులు చాలా అరుదని చెబుతుంటారు. ఉగ్రవాద, వేర్పాటువాద నిరోధక ఆపరేషన్లను సమర్థంగా నిర్వహించడంలో ఆయనకు ఎంతో అనుభవం ఉంది. తన కెరీర్‌లో సరిహద్దుల వద్ద జరిగిన ఘర్షణలు ఎన్నింటినో ఆయన చాకచక్యంగా పరిష్కరించారు. ఆ అనుభవం కారణంగానే ఆయన్ను కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాల అధిపతిగా నియమించింది. ముఖ్యంగా ఉగ్రవాదులపై ఉక్కు పిడికిలి బిగించడంతో ఆయన వారి పట్ల సింహస్వప్నంగా మారారు. మొదటిసారిగా ఉగ్రవాదుల వేటలో ఆయన సారథ్యంలోనే విదేశీ భూభాగాలపైకి వెళ్లి పోరాటం చేసింది. 2016 లో భారత్‌లోని యూరీ బేస్ క్యాంప్‌పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 19 మంది జవాన్లు అమరులయ్యారు. …
శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైల్ సదుపాయం కల్పించడం కోసం రాయదుర్గం– శంషాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో కారిడార్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించి మూడేళ్లు కావస్తున్నా ఇప్పట్లో పనులు జరిగే అవకాశం కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధులు కల్పించక పోవడమే ప్రధాన ఆటంకంగా ఉన్నది. 2019లోనే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రూ 4,500 కోట్ల వ్యయంతో అందుకు అవసరమైన పనులు చేపట్టడానికి మెట్రో రైల్ యాజమాన్యం కూడా సిద్ధంగా ఉంది. 30–32 కి.మీ పొడవైన ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రెస్ మెట్రో కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం అవసరమైన నిధులను కేటాయించక పోవడంతో ఇప్పటికి కనీసం భూసేకరణ కూడా చేయలేక పోయింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఎయిర్ పోర్ట్ కు ప్రయాణ కాలం 40 నిముషాల నుండి 20 నిముషాలకు తగ్గుతుందని భావిస్తున్నారు. ఢిల్లీ మెట్రో అధికారులు ఏడాది క్రితం రాయదుర్గం–…
శతాబ్ధాలుగా అమెరికాలో ఆధిపత్యం వహిస్తున్న శక్తివంతమైన, సాంప్రదాయమైన క్రైస్తవ మతస్థుల ప్రాబల్యం నానాటికి తగ్గుముఖం పడుతున్నదా? భవిష్యత్ లో ఆ మతస్థుల కన్నా, ఆ మతం నుండి బైటకు వెళ్ళినవారు ఎక్కువగా ఉండే అవకాశం ఉందా? అంటే అవుననే తాజాగా జరిపిన ఒక అధ్యయనం స్పష్టం చేస్తున్నది. అక్కడ ఇప్పటికీ క్రైస్తవమే ఆధిపత్యంలో ఉన్నా.. ఆ మతాన్ని వీడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చాలా అనూహ్య రీతిలో క్రైస్తవ మతం క్షీణిస్తున్నట్లు పివ్ రీసర్చ్ సెంటర్ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. నాస్తికులు, ఏ మతం స్వీకరించని వాళ్ల సంఖ్య అక్కడ క్రమంగా పెరుగుతోందని తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో 29 శాతం మంది యువత ఏ మతానికి చెందనివారు ఉన్నారు. గడిచిన 14 ఏళ్లలో ఇది 16 శాతం పెరిగినట్లు సర్వే పేర్కొన్నది. 2007లో సుమారు 78 శాతం మంది అమెరికా యువత తాము క్రైస్తవులమని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 63 శాతానికి పడిపోయినట్లు…
దేశంలో డ్రగ్స్ వినియోగం పెరగడంతో పాటు ఇటీవల స్మగ్లర్లు భారత్ ను కేంద్రంగా చేసుకొని డ్రగ్స్ రవాణా భారీగా సాగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. డ్రగ్స్ రవాణా రూట్లను మార్చడం, దేశానికి అతి పెద్ద తీర రేఖ ఉండటం.. డ్రగ్స్ స్మగ్లర్లు పెచ్చరిల్లడానికి ఊతం ఇస్తున్నట్లు వెల్లడవుతుంది. స్మగర్లు కొన్నేండ్లుగా స్మగ్లింగ్ పద్ధతిని మార్చి నేరుగా పోర్టుల ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. భారత్ కు చాలా పెద్ద తీర రేఖ ఉన్నది. అనేక పోర్టులు ఉన్నాయి. దీంతో నిఘా కష్టం అవుతున్నది. అన్ని పోర్టుల్లో నిఘా పెట్టామని, తనిఖీలు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. మరోవంక, క్రిప్టోకరెన్సీ, డార్క్‌నెట్‌లను డ్రగ్స్ బిజినెస్‌కు ఉపయోగిస్తున్నారంటూ హోం వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ ఆందోళన వ్యక్తంచేసింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీల నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కమిటీ అభిప్రాయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పార్లమెంటు సభ్యుడు ఆనంద్‌శర్మ్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ నివేదికను సభలో ప్రవేశపెట్టారు.…
* 50వ వార్షికోత్సవం డిసెంబర్ 16 భారతదేశానికి, పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లకు కీలకమైన చారిత్రాత్మక రోజు. 1971లో, బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్తాన్) పుట్టుకకు దారితీసిన పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారతదేశం ఘన విజయం సాధించింది. సరిగా 50 ఏళ్ళ క్రితం ఈ రోజున, పాకిస్తాన్ తన దేశంలో సగం భూభాగాన్ని కోల్పోయింది. తూర్పున తన బలగాలను కోల్పోయింది. పైగా భారతదేశానికి బహిరంగంగా లొంగిపోవాల్సి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద సైనిక లొంగుబాటు కూడా ఇదే కావడం గమనార్హం. ఒక సారి చైనాతో, పలు సార్లు పాకిస్థాన్ తో యుద్దాలు జరిగినా గతం 75 ఏళ్ళల్లో భారత్ సైన్యం నిర్ణయాత్మక విజయం సాధించిన యుద్ధం ఇదొక్కటే కావడం గమనార్హం. పైగా అమెరికా, బ్రిటన్ వంటి అగ్ర రాజ్యాలు కన్నెర్ర చేసినా, బహిరంగంగా హెచ్చరించినా భారత్ వాటిని లెక్క చేయకుండా యుద్ధంలో ముందుకు వెళ్ళింది. మిగిలిన యుద్దాలు అన్ని అమెరికా, రష్యా వంటి దేశాల జోక్యంతోనో, గెలుపొందలేమనో ఏకపక్షంగా శత్రు సైన్యం తోకముడవడంతో ఆగిపోయాయి. త్రివిధ దళాల ఉమ్మడి పోరాటం మరోవంక, త్రివిధ దళాలు ఉమ్మడిగా పోరాటాలకు సిద్ధం కావాలని ఇటీవల…