2012 నాటి షీనా బోరా హత్య కేసు నిందితురాలు, మీడియా మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంద్రాణి ముఖర్జీ తన కుమార్తె బోరా ఇంకా సజీవంగా ఉన్నదంటూ సరికొత్త సంచలనం సృష్టించారు. ఆ మేరకు ఇంద్రాణి సిబిఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. కాశ్మీర్లో షీనా బోరాను కలిశానని జైలులో ఉన్న తనను ఇటీవల ఓ మహిళ కనిపించి చెప్పిందని పేఆమె ర్కొన్నారు.
కాశ్మీర్లో షీనా బోరాను వెతకాలని ఆమె సిబిఐని కోరారు. లేఖతో పాటు సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇది త్వరలో విచారణకు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. షీనా బోరా హత్య కేసులో 2015లో అరెస్టైన నాటి నుండి ముంబయిలోని బైకుల్లా జైలులోఉన్నారు. బెయిల్ దరఖాస్తు చేసుకోగా.. గత నెలలో ముంబయి హైకోర్టు తిరస్కరించింది. త్వరలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి.
ఇంద్రాణి ముఖర్జీ డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ గన్‌తో పట్టుబడటంతో షీనా బోరా హత్య ఉదంతం బయటకు వచ్చింది. ఆ తర్వాత ముంబయి పోలీసుల విచారణలో విస్తు పోయే విషయాలు వెల్లడించాడు. తాను ఓ హత్య కేసును ప్రత్యక్షంగా చూశానని చెప్పాడు. 2012లో తన సోదరిగా చెప్పుకుంటున్న షీనా బోరాను ఇంద్రాణీ ముఖర్జీ గొంతు కోసి హత్య చేసినట్లు శ్యాంవర్ పోలీసులకు తెలిపాడు.
అయితే విచారణలో షీనా బోరా ఇంద్రాణి మొదటి కుమార్తె అని తేలింది. ముంబయిలో ఇంటిని తనకివ్వాలంటూ తల్లిని బ్లాక్ మెయిల్ చేస్తోందని వెల్లడైంది. విచారణలో ఇంద్రాణీ.. తన పిల్లలను ఆమె తల్లిదండ్రుల వద్ద విడిచిపెట్టి మీడియా ఎగ్జిక్యూటివ్ పీటర్ ముఖర్జీని రెండో వివాహం చేసుకున్నారు.
కాగా, ఓ సందర్భంలో ఇంద్రాణి ఫోటోను చూసిన షీనా ఆమె గురించి ఆరా తీయగా తన తల్లి అని తెలుసుకుంది. దీంతో ముంబయికి వెళ్లిన ఇంద్రాణిని షీనా కలువగా.. భర్త పీటర్‌కు షీనాను తన సోదరిగా పరిచయం చేసింది. అదే సమయంలో పీటర్, తన మాజీ భార్యకు కలిగిన సంతానం రాహుల్‌తో షీనా పరిచయం పెంచుకున్నారు.
2012లో హత్యకు గురి కావడానికి ముందు వరకు రాహుల్, షీనా కలిసే జీవించారు. ఈ విషయం పట్ల గుర్రుగా ఉన్న ఇంద్రాణీ తన మాజీ భర్త సంజయ్ ఖన్నా సాయంతో కుమార్తె హత్య చేసింది. అయితే ఆమె ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో రాహుల్.. ప్రశ్నించగా..షీనా తన లైఫ్ చూసుకునేందుకు విదేశాలకు వెళ్లిపోయిందని చెప్పారు.
దీంతో అంతా కథ సుఖాంతమైందనుకునే లోపు.. శ్యామ్ వర్ పట్టుబడటంతో షీనా హత్య బయటపడింది. షీనా బోరాను ముంబయిలోని బాంద్రాలో గొంతుకోసి చంపి, ఆమె మృతదేహాన్ని పడేసేందుకు పొరుగున ఉన్న రారుగఢ్ జిల్లాకు తీసుకు వెళ్లిందని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ఆమె అవశేషాలు కూడా దొరికాయని చెప్పారు. కాని వారి వాదనలు ఇంద్రాణి కొట్టిపారేస్తూ తాజాగా షీనా బోరా కాశ్మీర్లో ఉందని, వెతకండంటూ సిబిఐకి లేఖ రాశారు.