Author: Editor's Desk, Tattva News

అధిక వడ్డీ రేట్లతో ఆర్థిక వ్యవస్థల వృద్థి దెబ్బతిననుందని ప్రపంచ బ్యాంక్‌ విశ్లేషించింది. 2023లో ప్రపంచ వృద్ధి రేటు 2.1 శాతానికి పడిపోనుందని అంచనా వేసింది. 2022లో 3.1 శాతం వృద్ధి చోటు చేసుకుంది. 189 దేశాలు సభ్యత్వం కలిగిన ప్రపంచ బ్యాంక్‌ తన తాజా గ్లోబల్‌ ప్రాస్పెక్ట్స్‌ రిపోర్ట్‌లో పలు దేశాలు వరుసగా పెంచుతున్న వడ్డీ రేట్ల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రిపోర్ట్‌ ప్రకారం హెచ్చు వడ్డీ రేట్లకు తోడు ఉక్రెయిన్‌, రష్యాలోని ఆందోళన పరిణామాలు, కరోనా వైరస్‌ మహమ్మారి దీర్ఘకాలిక ప్రభావాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించే అవకాశం ఉందని విశ్లేషించింది. 2022లో 3.1 శాతం పెరిగిన ఆర్థిక వ్యవస్థ, ప్రస్తుత ఏడాదిలో 2.1 శాతం మాత్రమే విస్తరించవచ్చని అంచనా వేసింది. అమెరికాకు చెందిన ఫెడరల్‌ రిజర్వ్‌, ఇతర ప్రధాన కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి దూకుడుగా వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇది మహమ్మారి మాంద్యం,…

Read More

టీటీడీ ఆధ్వర్యంలో నవీ ముంబాయి లో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి బుధవారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేందర్‌ పడ్నవిస్‌, టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి సమక్షంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య పూజ కార్యక్రమాలను నిర్వహించారు. మహా ప్రభుత్వం కేటాయించిన సుమారు 10 ఎకరాల్లో నిర్మిస్తున్న ఆలయానికి రేమాండ్‌ గ్రూప్‌ సీఎండీ గౌతం హరి సింఘానియా 60 నుంచి 75 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా సీఎం ఏక్‌నాథ్‌ షిండే మాట్లాడుతూ ముంబాయి వాసుల సుదీర్ఘ కాల నెరవేరనుందని పేర్కొన్నారు. తిరుపతికి వెళ్లి స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లలేని భక్తులకు నవీ ముంబాయిలో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయం ఎంతగానో ఉపయోగ పడుతుందని వెల్లడించారు. ఆలయం నిర్మాణంలో తమ వంతు పూర్తి సహకారం అందజేస్తామని ఆయన తెలిపారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ తిరుమలలో ఉన్నమాదిరిగా నవీ…

Read More

రైతులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఏడాది ఖరీఫ్ లేదా వానాకాలం పంటలకు కనీస మద్దతు ధరల (ఎంఎస్‌పీ) పెంపునకు ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంఎస్‌పీ అనేది ప్రభుత్వం రైతుల నుండి పంటలను కొనుగోలు చేసే కనీస ధరను సూచిస్తుంది. ధరల పతనానికి వ్యతిరేకంగా రైతులకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. మార్కెట్‌లో అనూహ్య ఒడిదుడుకుల నేపథ్యంలో రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఎంఎస్‌పీ పెంపునకు కేంద్రం ఆమోదం తెలపడం కీలకమైన చర్యగా భావిస్తున్నారు. ఎంఎస్‌పీ అనేది నిర్దిష్ట వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర. ఎంఎస్‌పీ పెంపుకు సంబంధించిన కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మీడియాకు వివరించారు. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతున్న నేపథ్యంలో పంటలకు మద్దతు ధర పెంచడం వల్ల అన్నదాతలకు ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేశారు. 2023 – 2024 ఖరీఫ్‌…

Read More

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కేసులో మంగళవారం ఏకబిగిన ఎనిమిది గంటల పాటు మార్గదర్శి ఎండి శైలజాకిరణ్‌ను ఏపీ సిఐడి అధికారుల బృందం ప్రశ్నించింది. నిధులు మళ్లింపుపైనే ప్రధానంగా దృష్టి సారించింది. సీఐడీ ఎస్పీలు అమిత్‌ బర్దర్, హర్షవర్థన్‌రాజు, విచారణ అధికారి రవికుమార్‌తోపాటు 30 మందితో కూడిన సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని శైలజ నివాసానికి ఉదయం 10 గంటలకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సీఐడీ విచారణ కొనసాగింది. ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ హోదాలో చెక్‌ పవర్‌ కూడా ఉండటంతో నిధుల మళ్లింపుపై ఆధారాలు చూపించి, వాటిపై సమాధానాలు కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు సిఐడి విచారణ సందర్భంగా తనకు ఆరోగ్యం బాగా లేదని, విదేశాల నుంచి రావడంతో జ్వరం వచ్చిందంటూ విచారణకు సహకరించకుండా చాలాసేపు జాప్యం చేసినట్లు తెలుస్తోంది. విచారణ మొదలైన కొద్దిసేపటికే జ్వరంగా ఉందని, కళ్లు తిరుగుతున్నాయంటూ వెళ్లిపోయేందుకు సిద్ధమవ్వడంతో ఆమెను…

Read More

పోలవరాన్ని అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, నిర్వాసితుల పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పోలవరం వద్ద మంచి బ్రిడ్జిని నిర్మించాలని పర్యాటకులు ఉండేందుకు మంచి సదుపాయాలు ఇక్కడ హోటల్‌ ఏర్పాటు కూడా చేయాలని మౌలిక సదుపాయాలు ఏర్పాటుతో మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించిన అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ప్రాజెక్ట్‌ అధికారులు ఇంజనీర్లు ప్రాజెక్టు నిర్మాణ పనులను సమగ్రంగా ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను సైతం ఆయన పరిశీలన జరిపి తదుపరి సంభంధిత అధికారులతో సమగ్రంగా సమీక్ష జరిపారు. ఇటీవల కేంద్ర జల…

Read More

ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరికకు ఆ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరువురు నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరికకు సంబంధించి తమ తమ క్యాడర్‌కు సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 20న లేదా 25న పొంగులేటి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఖమ్మంలో జరిగే భారీ బహిరంగసభలో కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. అయితే ఖమ్మం సభకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. ఇక, బిఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరనున్నారనే చర్చ గత కొంతకాలంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే…

Read More

డార్క్‌ వెబ్‌ ఇంటర్నెట్‌ వేదికగా పాన్‌ ఇండియా స్థాయిలో జరుగుతోన్న భారీ డ్రగ్‌ ట్రాఫికింగ్‌ను మంగళవారం నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) చేధించింది. ఈ ఆపరేషన్‌ ద్వారా 15,000 బ్లాట్స్‌ల ఎల్‌ఎస్‌డిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. రెండు దశాబ్దాల్లో ఒకే ఆపరేషన్‌లో భారీ మొత్తంలో ఎల్‌ఎస్‌డిని స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని తెలిపారు. ఎల్‌ఎస్‌డి (లైసర్జిక్‌ యాసిడ్‌ డైథైలమైడ్‌) ఓ రసాయనిక డ్రగ్‌ పదార్థం. పక్కా ప్రణాళికతో ఓ ప్రైవేట్‌ మెసేజింగ్‌ యాప్‌ వికర్‌ మి ద్వారా యువతను టార్గెట్‌ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొదట ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా డ్రగ్స్‌ కావాలా అని అడుగుతారని, ఆసక్తి కనబరిచిన వారికి వెంటనే వికర్‌ మితో అనుసంధానం చేస్తారని పేర్కొన్నారు. డార్క్‌ వెబ్‌లో ప్రకటనలతో ఇన్‌స్టాగ్రామ్‌లో యువతను రీచ్‌ అవుతున్నట్లు తెలిపారు. క్రిప్టో కరెన్సీలో చెల్లింపులు జరుగుతున్నాయని, పాన్‌ ఇండియా స్థాయిలో ఈ నెట్‌వర్క్‌ పనిచేస్తోందని చెప్పారు. ఎల్‌ఎస్‌డిని ఎక్కువగా పోలాండ్‌, నెదర్లాండ్స్‌…

Read More

బాలాసోర్ రైళ్ల ప్ర‌మాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణ ప్రారంభించింది. మంగళవారం ఉద‌యం 10 మంది సీబీఐ అధికారుల బృందం బాలాసోర్‌లోని ప్రమాదస్థలికి చేరుకుంది. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి ఘటనకు గల కారణాలపై అన్వేష‌ణ చేప‌ట్టింది.రాష్ట్ర పోలీసులు సేకరించిన సాక్ష్యాలు, వాంగ్మూలాలను సీబీఐ పరిశీలించింది. రైల్వే మంత్రిత్వ శాఖ అభ్యర్థన, ఒడిశా ప్రభుత్వ సమ్మతితో కేంద్ర హోం శాఖ, డిఓపీటీ ఉత్తర్వులకు అనుగుణంగా సీబీఐ కేసు నమోదు చేసింది. కాగా, బాలాసోర్ రైలు దుర్ఘటనపై ఒడిశా పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంతో ప్రాణాలకు హాని కలిగించడం, మరణాలకు కారణమవ్వడం వంటి అభియోగాలతో ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందన్న ఆరోపణలపై సిబిఐ ప్ర‌త్యేక దృష్టి సారించ‌నుంది. రైళ్లు సురక్షితంగా నడవడంలో అత్యంత కీలకమైన ‘ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ’లో మార్పులు చేయడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు రైల్వే శాఖ ప్రాథమిక…

Read More

ఉక్రెయిన్‌, రష్యాల మధ్య నెలకొన్న భీకర యుద్ధం సుదీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై క్రెమ్లిన్ క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఉక్రెయిన్‌ దేశంలో అత్యంత కీలకమైన నీపర్‌ నదిపై ఉన్న నోవా కఖోవ్కా డ్యామ్‌ ను రష్యాదళాలు పేల్చేశాయి. దీంతో డ్యామ్‌లోని నీరంతా వార్‌జోన్‌లోకి ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే, తాజా ఘటనపై రెండు దేశాలు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇది రష్యా పనే అని ఉక్రెయిన్‌ మిలటరీ కమాండ్‌ ఆరోపించగా.. ఆక్రమిత ఉక్రెయిన్‌లోని రష్యా అధికారులు మాత్రం ఇది ఉగ్రదాడి అని చెబుతుండటం గమనార్హం. దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖేర్సాన్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని ఈ డ్యామ్‌ వ్యూహాత్మకంగా చాలా కీలకమైంది. గత కొన్ని రోజులుగా ఈ డ్యామ్‌కు సమీపంలో భారీగా దాడులు జరుగుతున్నాయి. 1956లో కఖోవ్కా జలవిద్యుత్తు కేంద్రంలో భాగంగా దీన్ని నిర్మించారు. ఈ డ్యామ్‌ 30 మీటర్ల ఎత్తు.. 3.2 కిలోమీటర్ల పొడవు ఉంది. అమెరికాలోని ఉటాలో గల గ్రేట్‌…

Read More

అక్రమంగా భూకేటాయింపు చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి, హెటిరో గ్రూప్‌ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ ఎంపీ పార్థసారథి రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్థసారథి రెడ్డి మేనేజింగ్‌ ట్రస్టీగా ఉన్న సాయిసింధు ఫౌండేషన్‌కు 15 ఎకరాల భూమిని లీజుకు ఇస్తూ ప్రభుత్వం 2018లో జారీచేసిన జీవో 59ని హైకోర్టు కొట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వ భూకేటాయింపుల పాలసీ (జీవో నంబర్‌ 571, జీవో నంబర్‌ 218) ప్రకారం దీనిపై తాజాగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టంచేసింది. ప్రజల ఆస్తులకు, వనరులకు ప్రభుత్వం ట్రస్టీగా మాత్రమే వ్యవహరించాలని, ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టేటప్పుడు ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని కఠిన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చాలా వేగంగా జరుగుతున్నాయనే కారణంతో అక్రమ కేటాయింపులు చట్టబద్ధమైపోవని, నిర్మాణాలు జరుగుతున్నాయనేది అసలు గ్రౌండ్‌ కానేకాదని హైకోర్టు స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌ గ్రామంలోని సర్వే నెంబర్‌ 41లో హైటెక్‌ సిటీ సమీపంలో అత్యంత విలువైన 15…

Read More