దేశంలో తొలి ఇంట్రానాసల్ కొవిడ్ వ్యాక్సిన్ ఇంకోవాక్ను ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ వ్యాక్సిన్ను రిపబ్లిక్ డే సందర్భంగా ప్రారంభించారు. ఇంకోవాక్ వ్యాక్సిన్ను హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసింది.
గతవారంలో కంపెనీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా రిపబ్లిక్ డే సందర్భంగా వ్యాక్సిన్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. గతేడాది డిసెంబర్లో వయోజనులకు హెటిరోలాగస్ బూస్టర్ డోస్గా వయోజనులకు హెటిరోలాగస్ బూస్టర్ డోస్గా వేసేందుకు డీజీఐసీ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది.
టీకాను ప్రభుత్వానికి రూ.325, ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాలకు రూ.800 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ను వాషింగ్టన్ యూనివర్సిటీ సెయింట్ లూయిస్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది.