అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ.. కొన్ని రోజులుగా నిరంతరం నికర విలువను కోల్పోతున్నాడు. తన సంస్థల స్టాక్‌లు మరింత దిగజారడంతో సోమవారం టాప్ లూజర్‌గా నిలిచాడు. సోమవారం అదానీ గ్రూప్‌కు చెందిన చాలా స్టాక్‌లు వాటి లోయర్ సర్క్యూట్లో లాక్ అయ్యాయి.
అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు ఐదు శాతం క్షీణించగా.. అదానీ ట్రాన్స్ మిషన్ స్టాక్స్ 10 శాతం పడిపోయాయి.ఎన్ డి టి వి స్టాక్ ధర కూడా ఈరోజు 4.98 శాతం నష్టపోయింది. గ్రూప్ కంపెనీల్లో అదానీ ఎంటర్ప్రైజెస్, అంబుజా సిమెంట్స్ ఇతర కంపెనీల కంటే కాస్త మెరుగ్గా ఉన్నాయి. అయితే ఈ రెండు స్టాక్స్ కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.
ప్రస్తుతానికి అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ 1.55 శాతం క్షీణించగా, అంబుజా సిమెంట్ షేరు ధర ఈ రోజు 0.47 శాతం నష్టపోయింది. ఇక.. అదానీ నికర విలువ, కంపెనీల స్టాక్‌లపై హిండెన్‌బర్గ్ నివేదిక తీవ్ర ప్రభావం చూపుతోంది.
హిండెన్‌బర్గ్ సంస్థ అదానీ గ్రూప్‌కి వ్యతిరేకంగా నివేదికను విడుదల చేసినప్పటి నుండి అదానీ నికర విలువ రోజు రోజుకు దారుణంగా పడిపోతోంది. అతను కొన్ని రోజులుగా బిలియన్ డాలర్లు కోల్పోయాడు. ఇది డిసెంబర్ 13, 2022న 134.2 బిలియన్ల డాలర్ల నుండి 59.3 బిలియన్ల డాలర్లకు తగ్గింది.
నివేదికలో అధిక వాల్యుయేషన్ల కారణంగా అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్‌లు వాటి ప్రస్తుత స్థాయిల నుండి క్షీణించే అవకాశం ఉందని పరిశోధనా సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
జపాన్‌కు చెందిన తదాషి యానై సోమవారం టాప్ విజేతగా నిలిస్తే, గౌతమ్ అదానీ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో టాప్ లూజర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఇక.. అదానీతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ కూడా టాప్ లూజర్ల జాబితాలో ఉన్నారు.
యుపి డిస్కమ్ టెండర్ రద్దు
ఇలా ఉండగా, ఈ సందర్భంగా పలు సంస్థలు అదానీ బాండ్లపై రుణాలు ఇవ్వడం ఆపేశాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టలేని పరిస్థితుల్లో.. ఉన్న ప్రాజెక్టులు సైతం చేజారిపోతున్నాయి. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వంకు చెందిన విద్యుత్తు పంపిణీ సంస్థ మధ్యాంచల్ విద్యుత్ విత్రన్ నిగమ్ అదానీ గ్రూప్‌నకు షాకిచ్చింది. 75 లక్షల స్మార్ట్ మీటర్ల అందించేందుకు ఉద్దేశించిన రూ.5,400 కోట్ల టెండర్ ప్రక్రియను రద్దు చేసింది. అధానీ గ్రూప్ అందరికన్నా తక్కువకు బిడ్ దాఖలు చేసినప్పటికీ.. అనివార్య కారణాల వల్ల టెండర్ రద్దు చేసుకవాల్సి వచ్చినట్లు డిస్కమ్ పేర్కొంది.