ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 7వికెట్ల తేడాతో నెగ్గిన టీమిండియా.. బుధవారం జరిగిన గ్రూప్‌ాబి రెండో లీగ్ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తుచేసింది.
తొలిగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 118పరుగులు చేసింది. ఛేదనలో టీమిండియా 18.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 119పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో గ్రూప్‌ాబిలో భారత్ 4పాయింట్లతో రెండోస్థానంలో నిలిచింది. తొలుత టీమిండియా స్పిన్నర్ దీప్తి శర్మ(3/15) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది.
ఆ తర్వాత రేణుక, పూజా ఒక్కో వికెట్‌తో చెలరేగడంతో విండీస్ జట్టు భారీస్కోర్ చేయలేకపోయింది. ప్రత్యర్ధి జట్టులో ఓపెనర్ టేలర్(42), క్యాంప్బెలె(30) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. కెప్టెన్ హేలీ మాథ్యూస్(2), హెన్రీ(2), ఫ్లెచర్(0) నిరాశపర్చారు. స్టాఫానీ టేలర్, షెమైన్ రాణిండంతో జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.
భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లతో మెరవగా.. రేణుక సింగ్, పూజ వస్త్రాకర్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో ఓపెనర్ మంధాన(10), జెమీమా రోడ్రిగ్స్ నిరాశపర్చగా.. షెఫాలీ వర్మ (28; 23బంతుల్లో 5ఫోర్లు), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (33; 42బంతుల్లో 3ఫోర్లు), రిచా ఘోష్ (44నాటౌట్; 32బంతుల్లో 5ఫోర్లు) రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
విండీస్ బౌలర్లలో కరిష్మా రెండు వికెట్లు పడగొట్టగా.. హేలీ మాథ్యూస్, హెన్రీ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన దీప్తి శర్మ అంతర్జాతీయ టీ20ల్లో వంద వికెట్ల మైలురాయిని అందుకుంది. టి20ల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా దీప్తి శర్మ నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దీప్తి శర్మకు లభించింది.