తిరుమలలో అక్రమాల నివారణకు టీటీడీ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది.
మార్చి ఒకటో తేదీ నుంచి ఈ టెక్నాలజీని తీసుకురానుంది. సర్వదర్శనం కాంప్లెక్స్ లో ఒకే వ్యక్తి అధిక లడ్డు టోకెన్లు పొందకుండా, గదుల కేటాయింపు కేంద్రాలు వద్ద, కాషన్ డిపాజిట్ కౌంటర్ల వద్ద ఈ టెక్నాలజీని వినియోగంలోకి తీసుకురానున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్చి 2 నుంచి 10వ తేదీ వరకు జరుగనున్న వార్షిక కల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.
కల్యాణోత్సవాల ఏర్పాట్లపై ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు. మార్చి 3న జరిగే కల్యాణోత్సవానికి విశేషంగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున విస్తఅతంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.