ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక చైనా సహాయంతో మరోసారి ఐఎంఎఫ్ నుండి రుణం తీసుకోనుంది. మార్చి మూడో వారం లేదా నాలుగోవారంలో ఐఎంఎఫ్ నుంచి 2.9 బిలియన్ డాలర్ల రుణం అందనుందని శ్రీలంక ప్రధాని విక్రమ్‌సింఘే మంగళవారం వెల్లడించారు.
పార్లమెంటులో అధ్యక్షుడు విక్రమ్‌సింఘే మాట్లాడుతూ.. ‘సోమవారం రాత్రి మాకు చైనా ఎగ్జిమ్ బ్యాంక్ నుండి ఓ లేఖ వచ్చింది. ఈ లేఖను చూసి దానిపై సంతకం చేసి ఐఎంఎఫ్‌కి పంపాము. భారత్, పారిస్క్లబ్ నుండి ఫైనాన్సింగ్ హామీల ఫలితంగా ఈ దశ రుణం ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నాము. బహుశా ఈ నెల మూడవ వారం లేదా నాల్గొవ వారంలో రుణం ఆమోదం అవుతుందని ఆశిస్తున్నాము.’ అని ఆయన పేర్కొన్నారు.
అయితే చైనా రుణ సహాయానికి ఎలాంటి మద్దతునిచ్చిందనేదానిది స్పష్టమైన సమాచారం లేదు. కాగా, ఒకవైపు విక్రమ్‌సింఘే ప్రభుత్వం ఐఎంఎఫ్ నుండి రుణాలు తీసుకుంటున్నా.. దేశంలో ఆర్థిక వృద్ధి రేటు అనుకున్నస్థాయిలో జరగడం లేదు. దీంతో శ్రీలంకలో పెట్రోల్, విద్యుత్‌లపై ఉన్న సబ్సిడీలను రద్దు చేసింది.
అలాగే నష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. శ్రీలంకకు చేసే రుణ సహాయంపై చైనా విదేశాంగమంత్రి ఖ్విన్ గ్యాంగ్ మంగళవారం మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయ రుణ సమస్యల పరిష్కారంలో చైనా భాగస్వామ్యం కొనసాగుతుంది’ అని ఆయన తెలిపారు.