టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిట్‌కు బదిలీ చేసింది. ఈ కేసును సిట్‌కు బదిలీ చేస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగనుంది.
ఇప్పటి వరకు ఈ కేసును బేగంబజార్ పోలీసులు దర్యాప్తు చేశారు. అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి నిందితులపై 409, 420, 120(బీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో 9 మంది నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ఏ3 రేణుకను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. మిగతా 8 మందిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. టీఎస్పీఎస్సీ చైర్మన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ యువజన, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పేపర్ లీకేజీ వ్యవసహారాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ కార్యాలయం లోపలికి విద్యార్థి సంఘాల నాయకులు చొచ్చుకెళ్లడంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇలా ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్ కార్యాలయం టిఎస్పిఎస్సి కార్యదర్శిని ఆదేశించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అసలైన అభ్యర్ధుల ప్రయోజనాలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించారు.
ఈ నెల 5వ తేదీన జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ రాతపరీక్ష ప్రశ్నాపత్రం లీకైందని సమాచారం అందడంతో.. టీఎస్పీఎస్సీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 12న జరగాల్సిన టీపీబీవో, 15, 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల రాతపరీక్షలను రద్దు చేసింది టీఎస్పీఎస్సీ.
ఏఈ పేపర్ లీక్ కేసులో టీఎస్పీఎస్సీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్‌రెడ్డిని ఉద్యోగంలో నుంచి తొలగించారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్‌ను సస్పెండ్ చేశారు. గురుకుల ఉపాధ్యాయురాలు రేణుక, ఆమె భర్త డీఆర్డీఏలో టెక్నికల్ అసిస్టెంట్ ఢాక్య, కానిస్టేబుల్ శ్రీనివాస్‌తో పాటు మరో నలుగురిని రిమాండ్‌కు తరలించారు.
కాగా, టీఎస్పీఎస్సీ పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరిగే అవకాశం లేదని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి చేశారు. పేపర్ లీకేజీ నిందితులను సిట్ అదుపులోకి తీసుకుందని, ప్రవీణ్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించామని ఆయన చెప్పారు. ప్రవీణ్ హ్యాకింగ్ చేసినట్లు గుర్తించామని, పర్ను రూ.10 లక్షలకు అమ్మినట్లు గుర్తించామని చెప్పారు. గ్రూప్ – 1 పరీక్షలకు మల్టీపుల్ జంబ్లింగ్ చేశామని జనార్దన్‌రెడ్డి తెలిపారు.
ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. 8 మంది నిందితులను చర్లపల్లి జైలుకు, ఏ3 నిందితురాలు రేణుకను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. దీనికంటే ముందుగా 9 మంది నిందితులను ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.