లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడే క్రమంలో 2030 నాటికి కేన్సర్, హృద్రోగాలు, రోగ నిరోధక శక్తిని హరించే వ్యాధులతో పాటు అరుదైన వ్యాధులకు వ్యాక్సిన్లు తీసుకోస్తామని పేరొందిన మోడర్నా ఫార్మా కంపెనీ తెలిపింది. సదరు వ్యాక్సిన్లు ప్రయోగ దిశలో మంచి ఫలితాలను ఇచ్చాయని మోడర్నా ప్రతినిధులు వెల్లడించారు.
వచ్చే ఐదు సంవత్సరాల్లో అన్ని రకాల వ్యాధులకు తమ కంపెనీ వ్యాక్సిన్లు రూపొందిస్తుందని మోడర్నా ఫార్మా కంపెనీ చీఫ్ మోడికల్ ఆఫీసర్ డాక్టర్ పాల్ బుర్టోన్ తెలిపారు. పేరొందిన కరోనా వ్యాక్సిన్ను కనిపెట్టిన సదరు ఫార్మా కంపెనీ ప్రస్తుతం వేర్వేరు రకాల కేన్సర్ కణితులు లక్ష్యంగా వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నది.
తాము అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు అత్యంత ప్రభావితమైనవని డాక్టర్ పాల్ బూర్టోన్ తెలిపారు. అవి లక్షలాది మందిని కేన్సర్ బారి నుంచి కాపాడుతాయని ఆయన చెప్పారు. ఒక్క ఇంజెక్షన్ ద్వారా కోవిడ్, ఫ్లూ లాంటి అనేకరకాల శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లను నయం చేయవచ్చునని తెలిపారు.
కరోనా మహమ్మారి కారణంగా బాధితులకు సత్వరం వ్యాక్సిన్లు అందించే క్రమంలో ఫార్మా కంపెనీల్లో వ్యాక్సిన్లపై పరిశోధన, వాటి తయారీలో వేగం పెరిగిందని, ప్రస్తుతం అదే వేగం తాము కేన్సర్, హద్రోగాల నివారణకు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లకు కూదా వర్తిస్తోందని డాక్టర్ పాల్ బుర్టోన్ చెప్పారు.