పంజాబ్లోని భటిండా మిలటరీ స్టేషన్లో బుధవారం ఉదయం జరిగిన దాడిలో నలుగురు సైనిక సిబ్బంది మరణించారు. తెల్లవారుజామున 4.30గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందని ఆర్మీ తెలిపింది. వెంటనే సత్వర ప్రతిస్పందనా దళాలను మోహరించి, ఆ ప్రాంతానుంతా చుట్టుముట్టారు. ఉగ్రవాదుల దుశ్యర్య లేదా మరేదైనా అనే దిశలో దర్యాప్తు జరుపుతున్నారు.
ఇన్సాస్ రైఫిల్, గొడ్డలి పట్టుకుని, కుర్తా పైజామాల్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి తెగబడ్డారని పంజాబ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పేర్కొంటోంది. ఆ వచ్చిన ఇద్దరు వ్యక్తులు కూడా తమ ముఖాలు కనబడకుండా ముసుగులు ధరించి వునాురని తెలిపింది.
గాలింపు బృందానికి ఆ ప్రాంతంలో ఇన్సాస్ రైఫిల్, తూటాలు దొరికాయనిసైన్యం తెలిపింది. ఆ ఆయుధాలను పంజాబ్ పోలీసులు, సైన్యానికి చెందిన సంయుక్త బృందాల ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. రైఫిల్లోనిమిగిలిన తూటాలు ఫోరెన్సిక్ విశ్లేషణ తర్వాత మాత్రమే అందుబాటులోకి వస్తాయని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది.
పంజాబ్ పోలీసులతో కలిసి జరుపుతున్న సంయుక్త దర్యాప్తు సాగుతోందని పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ నిర్బంధించలేదని తెలిపింది. అంతకు ముందు పంజాబ్ పోలీసులు మాట్లాడుతూ, 19తూటాలు మిలటరీ స్టేషన్లో లభ్యమయ్యాయని తెలిపారు.
నలుగురు జవాన్లు తమ బ్యారక్ల్లో నిద్ర పోతుండగా, వారిపై దాడి జరిగిందనిభటిండా ఎస్పి(దర్యాప్తు), ఈసంఘటనపై దర్యాప్తు జరుపుతున్న సీనియర్ అధికారి అజరు గాంధీ తెలిపారు. ఆఫీసర్స్ మెస్ వద్ద తెల్లవారు జామున 4.35గంటలకుకాల్పులు సంభవించాయి. మరణించిన నలుగురు జవాన్లు ఆర్టిలరీ యూనిట్కి చెందినవారే.
వారినిసాగర్ బనొ (25), కమలేష్. ఆర్(24), యోగేష్కుమార్(24), సంతోష్ నాగరల్ (25)గా వారిని గుర్తించారు. వారి కుటుంబాలకు సమాచారం తెలియజేసినట్లు ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కాల్పుల్లో మరెవరూ గాయపడలేదని, ఇతరత్రా ఆస్తినష్టం సంభవించలేదని సౌత్ వెస్ట్రన్ కమాండ్ తెలిపింది.
జరిగిన విషయమంతా ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలియచేశారు. ఇతరత్రా అనేక అంశాలతో పాటూ సోమవారం అదృశ్యమైన ఇన్సాస్ రైఫిల్, 28 బుల్లెట్లపై విచారణలు జరుగుతున్నాయని పంజాబ్ పోలీసులు తెలిపారు. మృతదేహాలు కనుగొన్న చోట 19బుల్లెట్లను కనుగొనుట్లు అజయ్ గాంధీ విలేకర్లకు తెలిపారు.