ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల జాబితాలో భాగ్యనగరం చోటు దక్కించుకుంది. దాంతో విశ్వ పటంలో హైదరాబాద్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. 2012 నుంచి 2022 పదేళ్ల కాలంలో హైదరాబాద్ లో హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ సంఖ్య భారీగా పెరిగినట్లుగా తాజాగా విడుదలైన నివేదిక వెల్లడించింది.
ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల నివేదిక 2023ను హెన్లీ అండ్ పార్టనర్స్ వెల్లడించింది. ఈ జాబితాలో మొత్తం 97 నగరాలు పట్టణాలు చోటు దక్కించుకున్నాయి. జాబితాలో మొదటి స్థానం అమెరికాలోని న్యూయార్క్ సిటీ నిలవగా. రెండో స్థానంలో జపాన్ రాజధాని టోక్యో నిలిచింది. న్యూయార్క్ నగరంలో 34000 మంది మిలియనీర్లు ఉండగా, టోక్యోలో 290300 మంది ఉన్నట్లుగా పేర్కొన్నారు.
మూడో స్థానంలో శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా (2.85 లక్షలు), నాలుగో స్థానంలో లండన్ (2.58 లక్షలు), ఐదో స్థానంలో సింగపూర్ (240100), నిలిచింది. తర్వాతి స్థానాల్లో…లాస్ ఏంజెలిస్ (205400) (అమెరికా), హాంకాంగ్ (129500), బీజింగ్ (12800) (చైనా), షాంఘై (127200) (చైనా), సిడ్నీ (126900) (ఆస్ట్రేలియా)నిలిచాయి.
ఇక మన దేశానికి వచ్చేసరికి దేశ ఆర్థిక రాజధాని ముంబయి మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచ జాబితాలో చూసినప్పుడు 59400 మంది మిలియనీర్లతో 21వ స్థానంలో నిలిచింది. తర్వాత ఢిల్లీ (30200) 36వ స్థానంలో, బెంగళూరు (12600) 60వ స్థానంలో, కోల్ కతా (12100) 63వ స్థానంలో, హైదరాబాద్ (11100) మందితో 65వ స్థానంలో నిలచింది.