దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన తుని రైలు దగ్ధం కేసును విజయవాడ రైల్వే కోర్టు సోమవారం కొట్టివేసింది. దర్యాప్తు అధికారులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న 41 మందినిరైలు దగ్ధం కేసులో నిందితులుగా నిరూపించలేకపోవడంతో వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారతీయ రైల్వేకు చెందిన రైలు తగులబెట్టిన కేసులో సీరియస్‌గా ఆర్పిఎఫ్ పోలీసులు దర్యాప్తు చేయకుండా తూతూ మంత్రంగా చేయడం పట్ల కోర్టు అసహనం వ్యక్తం చేసింది. కేసు వివరాల్లోకి వెళితే 2016లో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమించారు.
ఈ క్రమంలో ఆందోళనకారులు తునివద్ద రతాుచల్ ఎక్స్‌ప్రెస్ రైలును తగులబెట్టారు. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం 69 కేసులను నమోదు చేసింది. ఆయా కేసులను వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రైలు దగ్ధం కేసుకు సంబంధించి నిందితులుగా పేర్కొన్న 41 మందిలో ఎ-1గా ముద్రగడ పద్మనాభం, ఎా2గా ఆకుల రామకృష్ణ, ఎా3గా ప్రస్తుతం రహదారులు, భవనాలశాఖ మంత్రిగా పనిచేస్తున్న దాడిశెట్టి రాజా ఉన్నారు.
ఈ కేసుకు సంబంధించి 24 మంది సాక్షులు ఉండగా, వీరిలో 20 మంది కోర్టు విచారణకు హాజరయ్యారు. ఇందులో ఐదుగురు తమకేమీ తెలియదని సాక్ష్యం చెప్పారు. దర్యాప్తు సక్రమంగా చేయలేదంటూ కోర్టు ఆసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో ముగ్గురు దర్యాప్తు అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ప్రశిుంచింది.
దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన తుని రైలు దగ్ధం కేసులో పేర్కొన్న వారందరూ దోషులు కారని విజయవాడ రైల్వే కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో నిజంగా రైలు తగులబెట్టిన వారెవరనుది ప్రజల్లో చర్చ జరుగుతోంది. అసలైన నిందితులను గుర్తించడంలో ఆర్పిఎఫ్ పోలీసు అధికారులు ఎందుకు విఫలమయ్యారనే ప్రశ్న ఉద్భవిస్తోంది.
