టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కు వైసీపీ సర్కార్ భారీ షాక్ ఇచ్చేసింది. కరకట్ట వద్ద ఉన్న బాబు గెస్ట్ హౌస్ ని అకస్మాత్తుగా అటాచ్ చేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకుంది. క్రిమినల్ లా అమెండ్మెంట్ 1944 చట్టం ప్రకారం అధికారులు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఆ గెస్ట్ హౌస్ ని అటాచ్ చేసే ముందు స్థానిక న్యాయమూర్తికి సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దీనిని కరకట్ట వద్ద లింగమనేని అనే రియల్ ఎస్టేట్ బిగ్ షాట్ నిర్మించి, చంద్రబాబుకు ఇచ్చారని అంటున్నారు. చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు క్విడ్ ప్రోకో గా దీనిని ఇచ్చారని ఆరోపిస్తున్నారు.
చంద్రబాబు అధికార దుర్వినియోగం చేశారని ఆరోపిస్తున్న అనేక కేసులను ఏపీ సీఐడీ అధికారులు విచారిస్తున్న నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం పెద్దలు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. సీఆర్డీయే మాస్టర్ ప్లాన్ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లలో అవకతవకలకు పాల్పడ్డారని అధికారులు గుర్తించారని అంటున్నారు.
అలా చేసినందుకు బదులుగానే కరకట్ట మీద లింగమనేని గెస్ట్ హౌస్ ని బాబుకు ఇచ్చారని చెబుతున్నారు. ఇక ఈ విషయంలో చట్టాలను, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మారదర్శకాలను, సాధారణ ఆర్ధిక నియమాలను పూర్తిగా ఉల్లంఘించారని పేర్కొంటున్నారు. ఇది విచారణలో తేలడంతోనే ఇపుడు అకస్మాత్తుగా లింగమనేని గెస్ట్ హౌస్ ని అధికారులు అటాచ్మెంట్ చేసారని చెబుతున్నారు.
ఈ నేపధ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపరి అయిన లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించి అందుకు ప్రతిఫలంగా గెస్ట్ హౌస్ ని చంద్రబాబు తీసుకున్నారని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో ఏపీ క్రిమినల్ లా అమెండ్మెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్ చేయాలని ప్రభుత్వాన్ని సీఐడీ కోరింది.
దీంతో వెంటనే రియాక్ట్ అయిన రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం ఈ గెస్ట్ హౌస్ ని అటాచ్మెంట్ చేసుకుంది. ఇదిపుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గెస్ట్ హౌస్ ని ఎలా స్వాధీనం చేసుకుంటారంటూ కోర్టుకు చంద్రబాబు, లింగమనేని ఆశ్రయించే పరిస్థితి కనిపిస్తోంది అని అంటున్నారు. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరో మారు సీయార్డీయే చట్టం అమరావతి రాజధాని చుట్టూ రాజకీయం నడచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
