మాజీ మంత్రి వివేకానంద హత్య కేసులో విచారణను హాజరుకావలసిందిగా వైసిపి ఎంపి అవినాష్ రెడ్డికి సిబిఐ తాజాగా సోమవారం మరో నోటీసు జారీ చేసింది. హైదరాబాద్ కోఠిలోని కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు రావలసిందిగా ఆ నోటీస్ లో పేర్కొన్నారు.
ఇప్పటికే పలు మార్లు విచారణకు హాజరైన అవినాష్ తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని గతంలో ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్ విచారించిన కోర్టు అవినాష్ కు బెయిల్ మంజూరు చేయకుండా విచారణను వాయిదా వేసింది.
దీనిపై సుప్రీం కోర్టుకు అప్పిల్ కు అవినాశ్ వెళ్లారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీం కోర్టు గత నెల 25 వ తేది వరకు మాత్రమే అవినాష్ ను అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశించింది. దీంతో ఏప్రిల్ 25 తర్వాత అవినాష్ అరెస్ట్ తప్పదనే వాదలను బలంగా వినిపించాయి.
తాజాగా సిబిఐ అకస్మికంగా అవినాష్ కు విచారణకు రావలసిందిగా నోటీస్ జారీ చేసింది. దీంతో అవినాష్ లో టెన్షన్ బయలుదేరింది. ఈ విచారణకు హాజరవుతారా,లేక వాయిదా కోరతారా అనేది స్పష్టత రాలేదు. లేకుంటే మరోసారి ముందస్తు బెయిల్ కోసం కోర్టు ని ఆశ్రయిస్తారా అనేది చూడవలసి ఉంది.