నిఖిల్ సిద్ధార్థ్ రా ఏజెంట్‌గా నటిస్తున్న చిత్రం ‘స్పై’ సినిమాను నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితానికి సంబంధించిన రహస్యాల నేపథ్యంలో నిర్మిస్తున్నారు. సోమవారమే న్యూఢిల్లీలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం కర్తవ్య పథ్ వద్ద ‘స్పై’ టీజర్ విడుదల చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేసరికి 3 మిలియన్ వ్యూస్‌కు చేరుకోవడంతో చిత్ర యూనిట్ ఆనందం వెలిబుచ్చారు.
సుభాష్‌చంద్రబోస్ గారి గురించి చాలా విషయాలు మనకు తెలియవు. ఆయన స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ దాని పనులు చాలామందికి తెలీవు. ఎంటర్ ట్కెన్ మెంట్ తోపాటు దేశానికి తెలియాల్సిన పాయింట్ ఇందులో వుందని హీరో నిఖిల్ హైదరాబాద్ లో మీడియాతో చెప్పారు.
ఈ మధ్యకాలంలో జాతీయ అంశాలు ఉన్న సినిమాలు ఏవైనా వస్తేఏదో ఎజెండాతో వస్తున్నట్లు ఒక ముద్ర వేస్తున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. స్పై అజెండా బేస్డ్ సినిమానా? అనే ప్రశ్న ‘స్పై’ టీమ్‌కు ఎదురైంది. దీనికి నిఖిల్ సమాధానమిస్తూ.. ‘‘అజెండాలు ఏమిలేవు. రాజకీయ పార్టీలతో అసలు సంబంధమే లేదు. మా వెనుక ఏ రాజకీయ పార్టీ మద్దతు లేదు. ఎవరినీ తక్కువ చేసే సినిమా అయితే కాదిది. ఎవరినీ ప్రమోట్ చేసినట్లుగా ఉండదు. అలాగే కించపరిచినట్లుగా ఉండదు” అని స్పష్టం చేశారు.
ఒక నిజాయితీగా ప్రయత్నించిన ఫన్ సినిమా ఇదని చెబుతూ టీజర్ చూశాక అందరికీ అర్థమయ్యే ఉంటుందని చెప్పారు. ఈడీ ఎంటర్ టైన్ మెంట్స్‌పై కె రాజశేఖర్ రెడ్డి, సిఇఓగా చరణ్ తేజ్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. చిత్ర దర్శకుడు, ఎడిటర్ గ్యారీ బిహెచ్. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల.
విశాల్ చంద్రవేఖర్, సినిమాటోగ్రాఫర్లు వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), అభినవ్ గోమటం, యాక్షన్ డిజ్కెన్ రాబిన్ సుబ్బు, బాబీ, సానియా ఠాకూర్, ఐశ్వర్య మీనన్, నిఖిల్ సిద్దార్థ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.