అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్ సంస్థ ఇచ్చిన రిపోర్టును సుప్రీంకోర్టు ప్యానల్ తప్పుపట్టింది. అదానీ కంపెనీ ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని నిపుణుల కమిటీ తెలిపింది. రెగ్యులేటరీ వైఫల్యం కూడా ఏమీ లేదని సుప్రీంకోర్టు నియమించిన ప్యానల్ తన రిపోర్టులో తెలిపింది. అదానీ గ్రూపునకు క్లీన్ చిట్ ఇస్తున్నట్లు ఆ ప్యానల్ వెల్లడించింది.
2020 నుంచి దర్యాప్తులో ఉను 13 విదేశీ సంస్థల యాజమాన్యానిు సెబీ నిర్ణయించలేకపోయినట్లు తెలిపింది. ఏది ముందు, ఏది తరువాత అనే అంశాన్ని నిర్థరించలేని సందిగ్ధావస్థలో పడినట్లు తెలిపింది. అదానీ గ్రూప్‌పై దర్యాప్తు కోసం కమిటీని సుప్రీంకోర్టు మార్చిలో నియమించింది.
సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎఎం సప్రే నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. దీనిలో సభ్యులుగా ఒపి భట్, జస్టిస్ జెపి దేవధర్, కెవి కామత్, నందన్ నీలేకని, సోమశేఖర్ సుందరేశన్‌లను నియమించింది. ఈ కమిటీ తన నివేదికను ఇటీవల సుప్రీంకోర్టుకు సమర్పించింది. దీనిని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.
అయితే సెబీ మరింత విచారణ చేపట్టాలని, ఆ తర్వాతే దీనిపై పూర్తి నమ్మకం కలుగుతుందని సుప్రీం ప్యానల్ తెలిపింది. అదానీ గ్రూపు ధరలను మార్చి చూపలేదని, షేర్ల ధరలు పెరిగనట్లు ఎక్కడా కృత్రిమంగా చూపెట్టలేదని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ వెల్లడించింది. రిటేల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో సరైన విధానాలను పాటించినట్లు ప్యానల్ తెలిపింది.
అదానీ కంపెనీ తీసుకున్న చర్యల వల్ల స్టాక్ మార్కెట్లో నమ్మకం పెరిగిందని ప్యానల్ చెప్పింది. ప్రస్తుతం ఆ కంపెనీ స్టాక్స్ స్థిరంగా ఉన్నట్లు పేర్కొన్నది. కృత్రిమ ట్రేడింగ్ జరగలేదని, అటువంటి అంశాలను గుర్తించలేదని కమిటీ చెప్పింది. ట్రేడింగ్‌కు సంబంధించిన ఎటువంటి లోపాలను గుర్తించలేదని కమిటీ పేర్కొన్నది. పబ్లిక్ షేర్‌హోల్డింగ్, సంబంధిత పార్టీల నుంచి ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించడంలో ఎటువంటి ఉల్లంఘనలు జరగలేదు. షేర్ల అంశంలో రెగ్యులేటరీ వైఫ్యలం ఏమీ లేదని కమిటీ తెలిపింది.