రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల ఖరారుపై ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవోను తోసిపుచ్చుతూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు సోమవారం తీర్పు చెప్పారు.
ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు ఫీజులు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఆగస్టు 24వ తేదీన వెలువరించిన 53, 54జీవోలను సవాల్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు దాసరి దుర్గా శ్రీనివాసరావు, ఇతర విద్యా సంస్థలు హైకోర్టులో రిట్లు దాఖలు చేశాయి.
ఆయా విద్యా సంస్థల యాజమాన్యాల నుంచి తిరిగి ప్రతిపాదనలు తీసుకున్న తర్వాత కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రెండు జీవోలను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది.భౌగోళిక ప్రాంతాలను ఆధారంగా చేసుకుని ఫీజులను ఖరారు చేయడం సరికాదని చెప్పింది. దానితోపాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది.
తరగతులు, కేటగిరీల వారీగా కమిషన్ ఫీజులను సిఫారసు చేయలేదని తప్పుపట్టింది. మౌలిక సదుపాయాలను పరిగణనలోకి తీసుకుని విద్యా సంస్థలను వర్గీకరించి ఫీజుల ప్రతిపాదన చేయాలని చెప్పింది. రికార్డులన్నింటినీ పరిశీలించిన తర్వాతే 2020%ు21, 2022ు23, 2023ు%24 బ్లాక్ పిరియడ్కు ఫీజులను సిఫార్సులను చేయాలంది. 2022 మార్చి 31 నాటికి ఆప్రిక్రియ పూర్తి చేయాలంది.
అధికంగా ఫీజుల వసూళ్లు ఉంటే విద్యార్థులకు తిరిగి చెల్లించాలని, తక్కువగా వసూలు చేసుంటే విద్యార్థుల నుంచి యాజమాన్యాలు వసూలు చేసుకోవాలని చెప్పింది. ఒక గ్రామంలో అంతార్జాతీయ ప్రమాణాలతో విద్యా సంస్థ, కనీస సౌకర్యాలు లేని విద్యా సంస్థలో ఒకే తరహా ఫీజులు నిర్ణయించడం సరికాదని, సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమని తేల్చింది.
క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల్ని పెంపుదల చేయడం ఏకపక్షమని, జీవోలు జారీకి ముందు ఆయా విద్యాసంస్థల్లోని మౌలిక సదుపాయాల కల్పన, వ్యయాలను పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్ల వాదన. ఫీజులతో సంతఅప్తి చెందిన తర్వాతే తల్లిదండ్రులు ప్రైవేటు విద్యా సంస్థల్లో తమ పిల్లల్ని చేర్పిస్తారని, ఏకపక్షంగా జీవోలను జారీ చేసిందని, వీటిని కొట్టేయాలని కోరారు.
ప్క్రెవేట్ పాఠశాలలు, కాళాశాలల్లో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయకుండా కట్టడి చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని వాదించింది. విద్యార్థులు, వారి తల్తిదండ్రుల కష్టనష్టాలను దృష్టిలో పెట్టుకునే రెండు జీవోల జారీ అయ్యాయని చెప్పింది.
అశాస్త్రీయంగానే కాకుండా ఇష్టానుసారంగా ఫీజుల వసూళ్లు లేకుండా చేసేందుకు ఇచ్చిన జీవోలను సవాల్ చేసిన రిట్లను కొట్టేయాలని కోరింది. గతంలోనే తీర్పును వాయిదా వేసిన హైకోర్టు సోమవారం రెండు జీవోలను కొట్టేస్తూ ఉత్తర్వుల్ని వెలువరించింది.