జాతీయ నీటి అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మూడో స్థానం లభించింది. శనివారం ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో 4వ జాతీయ నీటి అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ అవార్డులను ఉప రాష్ట్రపతి జగదీప్ దన్ఖర్ ప్రదానం చేశారు. ఉత్తమ రాష్ట్రంగా మధ్యప్రదేశ్ మొదటి బహుమతి అందుకుంది. రెండో స్థానంలో ఒడిశా, మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచాయి.
11 విభాగాల్లో పురస్కారాలు ఇచ్చారు. జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సహాయ మంత్రులు బిశ్వేశ్వర్ తుడు, ప్రహ్లాద్ సింగ్ పటేల్ పాల్గొన్నారు. రాష్ట్రం తరపున జలవనరుల అభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పురస్కారం అందుకున్నారు. ఉత్తమ పాఠశాల విభాగంలో నంద్యాల జిల్లా చాగలమర్రిలోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయం రెండో స్థానం, ఉత్తమ పరిశ్రమల విభాగంలో తిరుపతికి చెందిన సిసిఎల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ మూడో స్థానం పొంది పురస్కారాలు అందుకున్నాయి.
ఉత్తమ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల విభాగంలో ఆనంతపురంలోని ఆక్టా ఫ్రెటరాు ఏకోలజీ సెంటర్‌కు స్పెషల్ కన్సోలేషన్ ప్రైజ్ లభించింది. ఉత్తమ జిల్లాల్లో తెలంగాణాలోని ఆదిలాబాద్‌కు మూడో స్థానం లభించింది. గ్రామ పంచాయతీ కేటగిరిలో దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం గ్రామానికి అవార్డు దక్కింది.
నీటి విధానాలను అవలంభించడం, ప్రజల్లో అవగాహన కల్పించినందుకు భద్రాది కొత్తగూడెం జిల్లా జగనాుథపురానికి అవార్డు వరించింది. ఉప రాష్ట్రపతి జగదీప్ దన్ఖర్ చేతుల మీదుగా జగనాుథపురం సర్పంచ్ గడ్డం భవాని, పంచాయతీ కార్యదర్శి షేక్ ఇబ్రహీం ఈ అవార్డును అందుకున్నారు. హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి రెండో అవార్డు దక్కింది.