ఆదిపురుష్ సహా భారత చిత్రాలపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. నేపాల్ రాజధాని ఖాట్మండు సహా పర్యాటక నగరమైన పోఖ్రాలలో సోమవారం నుండి భారత చిత్రాలపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సీత.. ఆగేయ నేపాల్‌లోని జనక్‌పూర్‌లో జన్మిస్తే.. ‘ఆదిపురుష్’ సినిమాలో మాత్రం భారత్‌లోనే జన్మించినట్లు చూపించారంటూ అక్కడి అధికారులు మండిపడుతున్నారు.
అలాగే ఖాట్మండులోని 17 థియేటర్లలో ఎలాంటి హిందీ సినిమా ప్రదర్శించకుండా పోలీసు సిబ్బందిని మోహరించినట్లు ఖాట్మాండు మేయర్ బలెంద్ర షా పేర్కొన్నారు. సీత జన్మించిన ప్రాంతానికి సంబంధించిన అభ్యంతరకర సందేశాన్ని తొలగించాలని చిత్ర యూనిట్‌ని మూడు రోజుల క్రితం కోరినట్లు తెలిపారు.
సంబంధిత సన్నివేశాన్ని మార్చకపోతే ఖాట్మండు మెట్రోపాలిటిన్ సిటీ (కెఎంసి)లో ఏ హిందీ చిత్రం ప్రదర్శితమయ్యే అవకాశం ఉండదని తెలిపారు. అయినప్పటికీ చిత్ర యూనిట్ అభ్యంతకరకర పదాలను ఇంకా తొలగించలేదని.. దీంతో జూన్ 19 నుంచి ఖాట్మాండ్ మెట్రోపాలిటన్ (కెఎంసి) పరిధిలోని థియేటర్లలో ‘ఆదిపురుష్’ సహా అన్ని హిందీ చిత్రాలను నిషేధిస్తున్నట్లు తెలిపారు.
ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు. కెఎంసి అథారిటీ అనుమతి ఇచ్చేంతవరకు హిందీ సినిమాలను ప్రదర్శించేది లేదని క్యూఎఫ్ఎక్స్ థియేటర్ యాజమాన్యం పేర్కొంది.
ఈ నిర్ణయాన్ని అధికశాతం మంది స్వాగతించగా, కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. దేశం కంటే ఎవరూ గొప్పవారు కాదని, జాతి ప్రయోజనాలు, సాంస్కృతిక గుర్తింపు ప్రశ్నార్థకమైనపుడు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాలని రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ యువనేత, బాగ్మతి ప్రావిన్స్ శాసనసభ్యుడు కెసి.సునీల్ పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ లో నిరసనలు
కాగా, ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రంపై వారణాసితోసహా ఉత్తర్ ప్రదేశ్‌లో అనేక చోట్ల సోమవారం నిరసనలు మిన్నంటాయి. ఆదిపురుష్ చిత్రం పోస్టర్లను హిందూ సంస్థల కార్యకర్తలు చింపి వేశారు. లక్నోలో ఆదిపురుష్ చిత్రనిర్మాత, దర్పైశకుల హిందూ మహాసభ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
నిరసనకారులతో సమాజ్‌వాది పార్టీ కూడా గొంతు కలిపింది. ఆదిపురుష్ చిత్రంలోని చౌకబారు డైలాగులతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని సమాజ్‌వాది పార్టీ తెలిపింది. రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని ఓం రౌత్ దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన ఆదిపురుష్ చిత్రంలోని సంభాషణలు, ఆ చిత్రంలో పాత్రలపై దేశంలోని పలు ప్రాంతాలలో వివాదం రాజకుంది.