టీమిండియా పురుషుల క్రికెట్ జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ నియమితులయ్యారు. బీసీసీఐకి చెందిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఆయన్ను ఏకగ్రీవంగా చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేసింది. ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ తర్వాత చేతన్ శర్మ రాజీనామా చేయడంతో చీఫ్ సెలక్టర్ స్థానం ఫిబ్రవరి నుంచి ఖాళీగా ఉంది.
దీంతో చీఫ్ సెలక్టర్ పదవి కోసం జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానించారు. దరఖాస్తుదారులకు సోమవారం నాడు ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూ అనంతరం సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరంజపే, శివ్ సుందర్ దాస్‌తో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ అజిత్ అగార్కర్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.
2007లో టీ20 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో అగార్కర్ ఉన్నాడు. 45 ఏళ్ల అగార్కర్ 26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో అతను 58 వికెట్లు తీయగా, వన్డేల్లో 288 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో 42 మ్యాచ్‌లు ఆడి 29 వికెట్లు తీశాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కామెంటేటర్‌గా చేస్తున్నాడు.
వన్డేల్లో అతిత్వరగా 50 వికెట్లు తీసిన ఫాస్టెస్ట్ బౌలర్‌గా అగార్కర్ పేరిట రికార్డు ఇంకా ఉంది. చివరిసారి కూడా చీఫ్ సెలెక్టర్ పదవి కోసం అగార్కర్ పోటీపడ్డారు. కానీ చేతన్ శర్మ చేతిలో అతను ఓడిపోయారు. ఇప్పుడు ఆ జాబ్‌కు అగార్కరే ముందు వరుసలో ఉన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్‌కు చీఫ్ సెలెక్టర్ బాధ్యతల్ని అప్పగించేందుకు బీసీసీఐ ఆసక్తి ఉన్నా అతను మాత్రం ఆసక్తి చూపలేదని లేనట్లు తెలుస్తోంది.