ప్రభుత్వ ఉద్యోగులకు 12వ వేతన సవరణ కమిషన్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కమిషన్ చైర్మన్‌గా రిటైర్డు ఐఏఎస్ అధికారి మన్మోహన్సింగ్ను నియమించింది. ఏడాదిలోగా వేతన సవరణకు సంబంధించిన నివేదిక అందజేయాలని ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రె డ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
2018 జూలై 1వ తేదీ నాటి నుండి అమల్లోకి వచ్చేలా 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పే స్కేలును ప్రభుత్వం సవరించింది. కాగా కొత్త పీఆర్సీ ఈ ఏడాది జూలై ప్రామాణికంగా వచ్చే ఏడాది కమిషన్ చేసే సిఫార్సుల మేరకు నిర్ణయాలు తీసుకోనుంది. కొత్తగా ఏర్పాటు కానున్న పే రిజివన్ కమిషన్ (పీఆర్సీ)కి నియమ నిబంధనలతో మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రస్తుతం అమలులో ఉన్న డీఏను ఏ మేరకు వేతనంలో విలీనం చేయవచ్చో పరిశీలన జరిపి తద్వారా కొత్త పేస్కేల్‌కు రూపకల్పన చేయాలని నిర్దేశించింది. . రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి సర్వీసు ఆధారంగా కల్పించాల్సిన పారితోషికాలు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న, ఎయిడెడ్ సంస్థలు, విశ్వవిద్యాలయాల్లోని బోధనేతర సిబ్బంది, ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, జెఎన్టియు, వర్క్ ఛార్జ్డ్ ఉద్యోగులు, ఫుల్‌టైమ్ కంటిజెరట్ ఉద్యోగులకు సంబంధిరచి కూడా సిఫార్సులు చేయాల్సి ఉంటుంది.
అయితే ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ ప్రయివేటు కళాశాలల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బందికి సంబందించి కమిషన్ సిఫార్సులు చేయవద్దని, జాతీయ జ్యుడీషియల్ వేతన కమిషన్ సిఫార్సుల ద్వారా వేతనాలు తీసుకుంటున్న హైయర్ జ్యుడీషియల్ సర్వీసులు, రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీసు అధికారులకు సంబందించి కూడా కమిషన్ సిఫార్సులు వద్దని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
ఆటోమేటిక్ అడ్వాన్స్మెరట్ స్కీమ్‌పైనా అధ్యయనం చేయాలని, ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలపైనా సిఫార్సులు చేయాలని నిర్దేశించారు. ఉద్యోగులకుచెల్లించాల్సిన ప్రత్యేక చెల్లింపులు, పరిహారాలు, ఇతర అలవెన్సులపైనా కమిషన్ సిఫార్సులు చేయాల్సి ఉంటుంది. నగదు రూపంలో, ఇతర రూపాల్లో చేయాల్సి చెల్లింపులపైనా కమిషన్ సిఫార్సులు చేయాలి.
పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చేయాల్సిన చెల్లింపులు, ప్రస్తుతం అమలు చేస్తున్న పింఛను విధానం, అందులో మార్పులు చేయాల్సిన అంశాలపైనా నివేదించాల్సి ఉంటుంది. ఉద్యోగ సంఘాలు, పాలనా శాఖల నుంచి వచ్చే ప్రతిపాదనలను కూడా పరిశీలించి సిఫార్సులు ఉరడాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల సంఖ్య, అందులో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలతో కూడా కమిషన్ అధ్యయనం చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కాగా కమిషన్ ఇచ్చే సిఫార్సులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకునే చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొనడం గమనార్హం. కమిషన్‌కు కావాల్సిన సమాచారాన్ని అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్‌ఒడిలు సమరపంచాలని స్పష్టం చేసిరది.