గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా 591 దేవాలయాల పునరుద్ధరణ, నూతన దేవాలయాల నిర్మాణానికి రూ.311 కోట్ల సి.జి.ఎఫ్. నిధులను మంజూరు చేసిన్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అయితే షరతులకు లోబడి ఇప్పటి వరకూ మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ కట్టని, నిర్మాణ పనులు ప్రారంభించని దేవాలయాలకు నోటీసులు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రాధాన్యత క్రమంలో సి.జి.ఎఫ్. నిధులను మంజూరు చేసేందుకు ముందుగా మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ కట్టాలని, దేవాలయ నిర్మాణ పనులను రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలనే కొన్ని షరతులతో ప్రొసీడింగ్స్ జారీ చేయడం జరిగిందని తెలిపారు. సి.జి.ఎప్. నిధుల మంజూరీకై ప్రొసీడింగ్స్ జారీచేసిన రెండేళ్ల కాల వ్యవధిలో మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ కట్టకుండా, దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభించకపోతే ఆయా దేవాలయాలకు సంబందించిన సి.జి.ఎఫ్. నిధుల మంజూరు ఆటోమేటిక్ గా రద్దయినట్లు భావించబడుతుందని స్పష్టం చేశారు.
ప్రాధాన్యత క్రమంలో సి.జి.ఎఫ్. నిధులను మంజూరు చేసేందుకు ముందుగా మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ కట్టాలని, దేవాలయ నిర్మాణ పనులను రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలనే కొన్ని షరతులతో ప్రొసీడింగ్స్ జారీ చేయడం జరిగిందని తెలిపారు.
సి.జి.ఎప్. నిధుల మంజూరీకై ప్రొసీడింగ్స్ జారీచేసిన రెండేళ్ల కాల వ్యవధిలో మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ కట్టకుండా, దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభించకపోతే ఆయా దేవాలయాలకు సంబందించిన సి.జి.ఎఫ్. నిధుల మంజూరు ఆటోమేటిక్ గా రద్దయినట్లు భావించబడుతుందని స్పష్టం చేశారు.
అటువంటి దేవాలయాలకు సంబందించి నూతన అంచనాలతో తిరిగి ప్రతిపాదిస్తే, నూతన ఎస్.ఎస్.ఆర్. రేట్ల ప్రకారం తిరిగి మంజూరు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అటువంటి దేవాలయాలకు సంబందించి నూతన అంచనాలతో తిరిగి ప్రతిపాదిస్తే, నూతన ఎస్.ఎస్.ఆర్. రేట్ల ప్రకారం తిరిగి మంజూరు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ నెల 12 న జరిగిన కేబినెట్ సమావేశంలో దేవాదాయ శాఖకు సంబందించి రెండు ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. పలు దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా శారీరకంగా దృఢంగా ఉన్నంతవరకూ అర్చకులుగా కొనసాగేలా, దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుండి 62 సంవత్సరాలకు పెంచుతూ కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
అదే విధంగా వంశపారపర్యంగా అర్చకత్వానికి అనుమతించడం జరిగిందని, అయితే అందుకు కొన్ని మాసాలు శిక్షణ ఇచ్చిన తదుపరి అర్హత పరీక్షను నిర్వహించడం జరుగుతుందని, అందులో ఉత్తీర్ణులు అయిన వారినే అర్చకులుగా తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. కేబినెట్ తీసుకున్న ఈ కీలక నిర్ణయాలను అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ధూప దీప నైవేధ్య పథకాన్ని విస్తృత స్థాయిలో అమలు పరుస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి కేవలం 1,561 దేవాలయాలకు మాత్రమే ఈ పథకం అమలు చేయడం జరిగేదని, కానీ తమ ప్రభుత్వం ఇప్పుడు మొత్తం 4,681 దేవాలయాలకు ఈ పథకాన్ని విస్తరించినట్లు ఆయన చెప్పారు.
రాష్ట్రంలో నూతన దేవాలయాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్టు భారీ స్థాయిలో నిధులను మంజూరు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఒక్కొక్క దేవాలయానికి రూ.10 లక్షల చొప్పును మొత్తం 1,917 దేవాలయాలకు నిధులను మంజూరు చేసిన్నట్లు వెల్లడించారు.
వీటిలో 204 దేవాలయాల నిర్మాణ పనులు పూర్తయినాయని, 890 దేవాలయాల నిర్మాణ పనులు ప్రగతిలో నున్నాయని, మరో 823 దేవాలయాల నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నట్లు వివరించారు. నూతనంగా మరో 873 దేవాలయాలకు శ్రీవాణి ట్రస్టు నిధులు మంజూరు చేయాలని టి.టి.డి. ఇ.ఓ.కి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.