విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో “మిషన్- కృష్ణా నది కాలవల ప్రక్షాళన” చేపట్టారు. నగరంలోని బందర్ కెనాల్, ఏలూరు కెనాల్, రైవస్ కెనాల్ కాల్వలోనీ ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను తొలగించేందుకు నగరపాలక సంస్థ కార్యాలయము ముందు ఉన్న కెనాల్ బండ్ నందు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ మూడు క్లీనింగ్ బోట్లను “పడవలను” ప్రారంభించినారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడతూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాని నగర కమిషనర్ కోరారు. నగరంలోని మూడు కాలువలు పై చెత్త వేయకుండా బందర్ కెనాల్ మొత్తం 8 బ్రిడ్జిలకు, ఏలూరు కెనాల్ మొత్తం 12 బ్రిడ్జిలకు, రైవస్ కెనాల్ మొత్తం 12 బ్రిడ్జిలకు గ్రిల్స్, సి.సి.కేమెరాలు, మైక్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహనా కల్పించే విధంగా నగరపాలక సంస్థ వారు కృషి చేస్తున్నమని కమిషనర్ తెలిపారు.
కాల్వల్లో పూల వ్యర్థాలు, ప్లాస్టిక్, లిక్విడ్, నివాస, వాణిజ్య వ్యర్థాలు నగర ప్రజలు నిత్యం కాలువలో వేయడం జరుగుతుందని ఇప్పటినుంచి అయిన వ్యర్థాలను కాలువలో వేయకుండా నగరపాలక సంస్థ శానిటేషన్ సిబ్బందికి ఇంటి నుండి వచ్చే చెత్తను వారి ఇంటి వద్దనే తడి పొడి, ప్రమాదకర వ్యర్ధాలను వేర్వేరుగా విభజించి ఇవ్వాలని కోరారు.
నగరంలోని కాలువలను పరిశుభ్రంగా మార్చేందుకు, దిగువ ప్రాంతాలలో నివసించే అనేక మంది ప్రజల జీవితాలను రక్షించడానికి, విజయవాడ నగర ప్రజలందరూ ఈ మిషన్‌లో బాధ్యతాయుతంగా పాల్గొనాలని పిలుపిచ్చారు. రానున్న రోజుల్లో నగరపాలక సంస్థ వారు పర్యాటక ప్రదేశాముగా కాలవులలో ఈ బోటింగ్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని కమిషనర్ పేర్కొన్నారు. అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి కూడా పాల్గొన్నారు.ప్రశాంత్ చంద్రసేన్ వాదనలు వినిపించారు.