దేశ రాజధాని నగరం ఢిల్లీలో వచ్చే వారాంతం జరుగనున్న జీ20 భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. వివిధ దేశాధినేతలు, అధికారుల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి భారీ కొండముచ్చుల బొమ్మలతో కూడిన కటౌట్లు స్వాగతం పలుకబోతున్నాయి. వినే అవకాశం ఉంటే కొండముచ్చులు చేసే శబ్దాలను కూడా వినవచ్చు. కోతుల బెడద నుంచి తప్పించుకోవడం కోసమే అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు.
జీ20 సదస్సు సెప్టెంబరు 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ సదస్సుకు ఈ సంవత్సరం భారత దేశం అధ్యక్షత వహిస్తోంది. ఇప్పటికే అనేక ఇతివృత్తాలతో మంత్రుల స్థాయిలో సమావేశాలు జరిగాయి ఢిల్లీలోని ప్రగతి మైదానంలో జరిగే సదస్సు కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కూడా నగరాన్ని సుందరీకరించడం కోసం కృషి చేస్తోంది.
నగరంలో కోతుల బెడద నుంచి తప్పించుకోవడం కోసం కొండముచ్చుల బొమ్మలతో కటౌట్లను ఏర్పాటు చేశారు. ఇవి సజీవంగా ఉన్నట్లే కనిపిస్తున్నాయి. రోడ్లపైనా, జీ20 సదస్సు జరిగే వేదికల వద్ద వీటిని ఉంచారు. కొండముచ్చులు చేసే శబ్దాలు చేయడంలో శిక్షణ పొందిన 40 మందిని కూడా నియమించబోతున్నట్లు అధికారులు తెలిపారు.
అతిథుల కోసం అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దేశరాజధాని ప్రాంతం (ఎన్సిఆర్) పరిధిలోని దాదాపు 30 హోటళ్లను వీరి ఆతిథ్యం కోసం బుక్ చేశారు. ఢిల్లీలోని ఐటీసీ మౌర్యా, తాజ్ మాన్సింగ్, తాజ్ ప్యాలెస్, హౌటల్ ఒబెరారు, హౌటల్ లలిత్, ది లోధీ, మెరిడీయన్, హయత్ రీజెన్సీ, షంగ్రి లా, లీలా ప్యాలెస్, హౌటల్ అశోక, ఎరోస్ హౌటల్, ది సూర్యా, రాడిసన్ బ్లూ ప్లాజా, జేడబ్ల్యూ మారియట్, ది లీలా యాంబియన్స్ కన్వెన్షన్, ది ఇంపీరియల్ తదితర హౌటళ్లు ఉన్నాయి.
ఇక ఎన్సీఆర్ పరిధిలోని వివంత, ఐటీసీ గ్రాండ్, తాజ్ సిటీ సెంటర్ హయత్ రీజెన్సీ (గురుగ్రామ్) ది ఒబెరారు తదితర హౌటళ్లున్నాయి. ప్రభుత్వ అధికారుల సమాచారం ప్రకారం ఐటీసీ మౌర్యాలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ బస చేయనున్నారు. ఇక్కడ అన్ని ఫ్లోర్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ కమాండోల ఆధీనంలోకి వెళ్లనున్నాయి.
ఈ హౌటల్ 14 వ అంతస్తులో బైడెన్ బస చేసే గది ఉంది. ఆ ఫ్లోర్ చేరడానికి ప్రత్యేకంగా లిఫ్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఈ హౌటల్లో 400 గదులను అతిథుల కోసం బుక్ చేశారు. ఇక హౌటల్ షంగ్రి-లాలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, క్లారిడ్జెస్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, ఇంపీరియల్ హౌటల్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఆతిథ్యం స్వీకరించనున్నారు.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సదస్సుకు హాజరైతే తాజ్ ప్యాలెస్లో ఆయనకు విడిది ఏర్పాటు చేశారు. ఇదే హౌటల్లో బ్రెజిల్ నుంచి వచ్చే అతిథులు కూడా ఉంటారు. ఒబెరారు హౌటల్లో తుర్కియే దౌత్య బృందాలు బసచేయనున్నాయి. మారిషస్, నెదర్లాండ్స్, నైజిరీయా, స్పెయిన్ బృందాలు లా మెరీడియన్ హౌటల్లో ఉండనున్నాయి.