వన్డే ప్రపంచకప్ 2023 కోసం టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా.. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా ఉండనున్నారు.
గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ కు ప్రపంచకప్ జట్టులో చోటు కల్పించారు. ఇషాన్ కిషన్ మరో వికెట్ కీపర్ గా ఉండనున్నాడు. వన్డే ఫార్మాట్ లో పెద్దగా రాణించని సూర్యకుమార్ యాదవ్ పై బీసీసీఐ సెలెక్టర్లు నమ్మకం ఉంచారు. శ్రేయస్ అయ్యర్ కూడా తన స్థానాన్ని నిలుపుకున్నాడు.
ఇక, ఆసియా కప్ లో చోటు దక్కించుకున్న తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణలతో పాటు బ్యాకప్ గా ఉన్న సంజూ సామ్సన్ లను బీసీసీఐ పక్కన పెట్టింది. ప్రపంచకప్ జట్టులో మార్పులు చేసుకునేందుకు ఐసీసీ అవకాశం ఇచ్చింది. సెప్టెంబర్ 28 వరకు మార్పులు చేసుకోవచ్చు.
టీమిండియా ప్రపంచకప్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, శుబ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దుల్ ఠాకూర్, జస్ ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్
బ్యాటర్లు : రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్
వికెట్ కీపర్లు : ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్
ఆల్ రౌండర్లు : హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్
బౌలర్లు : మొహమ్మద్ షమీ, బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ (స్పిన్నర్)