మొన్నటి వరకు టీడీపీతో పొత్తుపై ఆచీతూచీ మాట్లాడిన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీపై కుండబద్దలు కొట్టారు. మొన్నటి వరకు వచ్చే ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తీసుకోలేదని, మొన్నటి వరకు ఆలోచిస్తూనే ఉన్నానని చెప్పారు. కానీ ఇవాళ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
రాజముండ్రి జైలులో రేమండ్ లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును ములాఖత్‌లో నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ లతో కలిసి కలిసిన అనంతరం గురువారం మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ, తెలుగు దేశం కలిసి వెళ్తాయని వెల్లడించారు. ఈ నిర్ణయం రెండు పార్టీల భవిష్యత్‌కు సంబంధించి కాదని, రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయం చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని చెబుతూ తాము విడివిడిగా పోటీ చేస్తే దశబ్దాలైనా ఇదే అరాచకం కొనసాగుతుందని చెప్పారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని పేర్కొంటూ సీట్ల పంపంకంపై తర్వాత మాట్లాడతానని తెలిపారు. రెండు పార్టీలు కలిసి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి కార్యాచరణను రూపొందిస్తామని ప్రకటించారు.
చంద్రబాబు అరెస్టు, ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ములాఖత్ రాష్ట్రానికి చాలా ముఖ్యం అని చెబుతూ టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి వెళ్లాలనేది తన కోరిక అని చెప్పారు. ఈ విషయాన్ని పదే, పదే చెప్పాను.. బీజేపీకి కూడా చెప్పాను.. పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని భావించాను అని పేర్కొన్నారు.
సమిష్టిగా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే అందరం కలిసి పోటీ చేయాలనేది తన భావన అని వివరించారు. ఈ దుష్ట పాలనను ప్రజలు తీసుకోలేరని, తాను రోడ్డుపైకి రావడానికి అదే కారణం అని తెలిపారు. తెలంగాణ సరిహద్దులో తనను 2వేలమందితో అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ క సామాన్యుల్ని బతకనిస్తారా? అని ప్రశ్నించారు. తాను ప్రధానిని కలిసిన ప్రతిసారీ జగన్ గురించి చెప్పలేదని అంటూ ఆయనకు అన్ని విషయాలు తెలుసని తెలిపారు. విశాఖలో ఇబ్బంది పెట్టిన విషయాలు, సినిమాలు ఆపిన సంగతి తెలియదా? అంటూ ఆయనకు అన్ని విషయాలు తెలుసన్నారు.
గత నాలుగున్నరేళ్లగా అరాచక పాలన ఎలా ఉందో చూస్తున్నామని చెబుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా కేసులు పెట్టి.. చాలా అన్యాయంగా ఆయన్ను రిమాండ్‌కు పంపించడం బాధాకరమని చెప్పారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించడానికి వచ్చానన్నారు. చంద్రబాబుకు, తనకు గతంలో పాలసీలపరంగా భిన్నమైన ఆలోచనలు ఉన్నాయని, తాను విడిగా పోటీ చేశామని గుర్తు చేశారు.
అయితే, జనసేన పార్టీ తరఫును తాను రాష్ట్రం బావుంండాలని కోరుకున్నానన్నారు. 2014లో జనసేన పార్టీ స్థాపించిన సమయంలో ఏపీ విభజన తర్వాత రాజధాని లేదు, విభజన సమస్యలు ఉన్నాయని గుర్తు చేశారు. 2014లో నరేంద్ర మోదీకి మద్దతు పలికానని పేర్కొంటూ దక్షిణాది రాష్ట్రాల్లో తాను ముందుగా ముందుకు వచ్చి బీజేపీకి మద్దతు ఇచ్చానని తెలిపారు. దేశానికి బలమైన నాయకత్వం కావాలని తాను కోరుకున్నానని.. అందుకే మోదీకి మద్దతు పలికినట్లు చెప్పుకొచ్చారు. ఆ రోజు తనను అందరూ తిట్టారు.. తాను నిర్ణయం తీసుకుంటే వెనక్కు వెళ్లనని స్పష్టం చేశారు.