చంద్రయాన్-3 ల్యాండింగ్ వీడియోకు 80 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయని యూట్యూబ్ చీఫ్ నీల్ మోహన్ తెలిపారు. లైవ్ స్ట్రీమింగ్‌లో ఈ రికార్డు సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను ఆయన అభినందించారు.
‘ఇది (చంద్రయాన్-3 మూన్ ల్యాండింగ్) చూడటానికి చాలా ఉత్సాహంగా ఉంది. ఏక కాలంలో 8 మిలియన్ ( లైవ్‌గా) వీక్షించడం అపురూపం. ఇస్రో బృందానికి అభినందనలు’ అని ఎక్స్‌లో ప్రశంసించారు. అలాగే యూట్యూబ్ ఇండియా పాత పోస్ట్‌ను అందులో యాడ్ చేశారు.
కాగా, ఆగస్ట్ 23న చంద్రయాన్-3 మూన్‌పై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యింది. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా ఇస్రో ప్రసారం చేసిన లైవ్ స్ట్రీమ్‌ను 80 లక్షల మందికిపైగా (8 మిలియన్లకు పైగా) వీక్షించినట్లు యూట్యూబ్ ఇండియా పేర్కొంది.
ఏక కాలంలో అత్యధిక మంది వీక్షించిన ప్రపంచ వ్యాప్త ప్రత్యక్ష ప్రసారమని ఎక్స్‌లో పేర్కొంది. ‘మనం వెళ్లగలిగాం: భారతదేశం చంద్రునిపై దిగింది’ అని పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 ల్యాండింగ్ లైవ్ స్ట్రీమింగ్ అరుదైన రికార్డ్ అని యూట్యూబ్ చీఫ్ నీల్ మోహన్ పేర్కొన్నారు. ఈ ఘనత సాధించిన ఇస్రోను బుధవారం ఆయన అభినందించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.