ఆసియా క్రీడల ఆరంభం సందర్భంగా ఆతిథ్య చైనా, భారత్ దేశల మధ్య పెను వివాదం నెలకొంది. ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు వుషు క్రీడాకారులకు చైనా ప్రభుత్వం వీసాను నిరాకరించింది. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వుషు అథ్లెట్లను ఆసియా క్రీడల్లో పాల్గొనకుండా చైనా ప్రభుత్వం అడ్డుకుంది.
ఇక చైనా వెఖరీని నిరసిస్తూ కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆసియా క్రీడల ఆరంభోత్సవ వేడుకల నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరింధమ్ బాగ్చి శుక్రవారం అధికారికంగా వెల్లడించారు.
చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో వుషు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు అరుణాచల్ ప్రదేశ్ క్రీడాకారులను ఆతిథ్య దేశం చైనా వీసాను నిరాకరించడంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత్‌కు చెందిన అరుణాచల్ ప్రదేశ్ క్రీడాకారులకు వీసాను చైనా నిరాకరించి, ఆసియా క్రీడల్లో వారు పాల్గొనకుండా అడ్డుకున్నది.
దానితో నిరసనగా, చైనాలోని హాంగ్జౌలో శనివారం జరుగనున్న ఆసియా గ్రేమ్స్ ప్రారంభ వేడుకలో పాల్గొనకూడదని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ నిర్ణయించారు. దానితో ఆయన చైనా పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు.
చైనాలోని హాంగ్జౌలో జరుగనున్న 19వ ఆసియా క్రీడలకు అక్రిడిటేషన్, ప్రవేశాన్ని నిరాకరించడం ద్వారా అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన కొంత మంది భారతీయ క్రీడాకారుల పట్ల చైనా అధికారులు వివక్ష చూపారని ఆరోపించారు.
కాగా, అరుణాచల్ ప్రదేశ్ తమ అంతర్భాగమని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రాంతం, జాతి ఆధారంగా భారతీయ పౌరుల పట్ల చైనా వివక్ష చూపడాన్ని నిరాకరిస్తున్నట్లు తెలిపింది. ఆసియా క్రీడల స్ఫూర్తిని చైనా ఉల్లంఘించినట్లు విమర్శించింది. ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయంతోపాటు, బీజింగ్‌లో కూడా దీనిపై నిరసన వ్యక్తం చేసినట్లు వెల్లడించింది.
మరోవైపు 19వ ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్జౌలో ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యాయి. అయితే ఈ నెల 23న అధికారిక ప్రారంభ వేడుక నిర్వహించనున్నారు. శనివారం జరిగే ఈ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పాల్గొంటారు. అక్టోబర్ 8 వరకు ఆసియా క్రీడలు కొనసాగనున్నాయి. భారత్‌తో సహా ఆసియాలోని దాదాపు అన్ని దేశాలు ఈ మినీ ఒలింపిక్స్‌లో పోటీపడనున్నాయి.