దసరా, దీపావళి పండుగల సందర్భంగా అక్టోబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు వివిధ ప్రాంతాలకు పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. దానాపూర్ టు సికింద్రాబాద్ (03225) ప్రత్యేక రైలును అక్టోబర్ 5వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ప్రతి గురువారం పాట్నా టు సికింద్రాబాద్ (03253) స్పెషల్ రైళ్లను నడుపుతున్నారు.
అక్టోబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ప్రతి సోమ, మంగళవారాల్లో సికింద్రాబాద్ టు పాట్నా (07255) అక్టోబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు ప్రతి శుక్రవారం హైదరాబాద్ టు పాట్నా(07255) అక్టోబర్ 4వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇక సికింద్రాబాద్ టు దానాపూర్(03226) ప్రత్యేక రైలు అక్టోబర్ 5వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు, విశాఖపట్నం టు సికింద్రాబాద్(08579) అక్టోబర్ 4వ తేదీ నుంచి నవంబర్ 29వ తేదీ వరకు ప్రతి బుధవారం సర్వీసులు అందిస్తుందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.
ఈ రైలు రాత్రి 7 గంటలకు విశాఖలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఇక సికింద్రాబాద్ టు విశాఖపట్నం(08580) రైలు అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని దక్షిణమధ్య రైల్వే పేర్కొంది.