సాహిత్యంలో ఈ యేటి నోబెల్ బహుమతి నార్వేకు చెందిన రచయిత జాన్ ఫోసేకు దక్కింది. మానవుల స్థితిగతులను ఆధారంగా చేసుకుని తన కథనాలను రాసినందుకు గానూ జాన్ ఫోసేకు ఈ అవార్డు దక్కింది. ఎంతో వినూత్నాత్మకంగా ఆయన నాటకాలు, పద్యాలు రాశారు.
స్వరం వినిపించలేని వారి కోసం ఆయన సాహిత్యం పనికి వచ్చినట్లు నోబెల్ కమిటీ తన ప్రకటనలో పేర్కొన్నది. ఫోసే తన కథనాల్లో మానవ స్థితిగతుల్నే ముఖ్య థీమ్‌గా తీసుకున్నారు. నార్వే వెస్ట్ కోస్ట్ ప్రాంతంలో ఆయన 1959లో జన్మించారు. నార్వేయన్ నినార్క్ శైలిలో ఆయన రచనలు ఉంటాయి.
ఆయన రచనల్లో నాటకాలు, నవలలు, కవిత్వాలు, వ్యాసాలు, చిన్నపిల్లల పుస్తకాలు, తర్జుమాలు ఉన్నాయి. నార్వేలో పుట్టిన జాన్ ఫోసే తన కథనాలతో ఎంతో ప్రఖ్యాతి గాంచారు. మన చుట్టూ జరిగే సంఘటనలే ఆయన కథనాలకు ఆధారం చేసుకోవడమే జాన్ ఫోసే ప్రత్యేకత. నార్వే వెస్ట్ కోస్ట్ ప్రాంతంలో 1959లో జాన్ ఫోసే పుట్టారు.
నార్వేయన్ నినార్క్ శైలిలో జాన్ ఫోసే రచనలు ఉంటాయి. ఆయన రచనల్లో కవిత్వాలు, నాటకాలు, వ్యాసాలు, నవలలు, పిల్లల పుస్తకాలు, వివిధ భాషల నుంచి తర్జుమాలు ఉంటాయి. జాన్ ఫోసే ఎంతో వినూత్నంగా నాటకాలు, పద్యాలను రాశారు.
మాటల్లో వినిపించలేని ఎన్నో అంశాలకు ఆయన రాసిన కథనాలు, నాటకాలు, పద్యాలు గళంగా మారాయని ఈ అవార్డు ఎంపిక చేసిన సందర్భంగా నోబెల్ కమిటీ పేర్కొంది.
