ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య మరోసారి యుద్ధ జ్వాలలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మెరుపు దాడులు చేసింది. వేల రాకెట్లతో ఇజ్రాయెల్‌పై హమాస్ విరుచుకపడింది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 300కు పైగా మృతుల సంఖ్య పెరిగింది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో మరో 1500 మంది గాయపడ్డారు.
పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ దాడులను ఇజ్రాయెల్ తిప్పికొట్టింది. ఇజ్రాయెల్ దాడుల్లో 232 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఇజ్రాయెల్ దాడుల్లో సుమారు 1700 మందికి పైగా పాలస్తీనియన్లకు గాయపడ్డారు.
ఇక తమపై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. దాడులకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. ఇజ్రాయెల్ తీర్చుకునే ప్రతీకారంలో గాజా రూపురేఖలే మారిపోతాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
‘‘ హమాస్ మోహరించి, దాగివున్న, కార్యకలాపాలకు అడ్డగా ఉన్న దుర్మార్గపు ప్రదేశాలన్నింటిని మేము శిథిలాలుగా మారుస్తాం. నేను గాజా వాసులకు చెబుతున్నాను ఇప్పుడే వెళ్లిపోండి. ఎందుకంటే మేము ప్రతిచోటా శక్తివంతమైన ఆపరేషన్లు నిర్వహిస్తాం’’ అని ప్రధాని ఒక ఎక్స్ వేదికగా హెచ్చరించారు. ఇజ్రాయెల్‌లో యుద్ధ పరిస్థితులు ఉన్నాయని ప్రకటించిన మరుసటి రోజయిన ఆదివారం ఈ మేరకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. దక్షిణ ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో రాకెట్ మోతలు ఇంకా మోగుతూనే ఉన్నాయని ఇజ్రాయెల్ మీడియా చెబుతోంది.
ఇజ్రాయెల్ సరిహద్దుల్లోని దాదాపు 14 ప్రాంతాల నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ పౌరులతో పాటు సైనికులను కూడా బందీలుగా తీసుకున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఓ ఇజ్రాయిల్ సైనికురాలిని చంపి ఆమెను కారులో వేసి నగ్నంగా ఊరేగించడం.. సైనికుడిని కాల్చి చంపిన వీడియోలు కూడా బయటికి రావడంతో ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించి హమాస్ మిలిటెంట్లు చేస్తున్న ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇజ్రాయెల్ ప్రారంభించిన ‘ఆపరేషన్ స్వార్డ్స్ ఆఫ్ ఐరన్’ శనివారం సాయంత్రానికి పేరుకు తగ్గట్లే అత్యంత క్రూరంగా మారింది. ఓవైపు హమా్‌సల అధీనంలోని గాజాస్ట్రి్పతోపాటు.. గాజాపైనా రాకెట్ల వర్షం కురిపించింది. హమా్‌సలకు మద్దతుగా పాలస్తీనా వైపునుంచి ర్యాలీగా బైకులపై ఆయుధాలతో, పాలస్తీనా జెండాలతో వస్తున్న హెజ్బోలా ఉగ్రవాదులను మట్టికరిపించారు. దేశంలోకి చొరబడ్డ హమాస్ ఉగ్రవాదులు తిరిగి గాజాస్ట్రి్పకు వెళ్లకుండా కట్టడి చేశారు. ఉగ్రవాదులను సజీవంగా పట్టుకుని, హింసించి వారి చేతులను కట్టేసి కాల్చిచంపేశారు.