ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా పలు రికార్డులను నెలకొల్పింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకపై 302 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా ఏడు మ్యాచుల్లో గెలుపొందడం ఇదే తొలిసారి.
అలాగే మహ్మద్ షమీ(5/18) బౌలింగ్‌లో మెరిసి.. వన్డే ప్రపంచకప్‌లో 45వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు.
ఈ క్రమంలో జహీర్‌ఖాన్, జవగళ్ శ్రీనాథ్(44వికెట్లు) రికార్డును చెరిపేసాడు. అలాగే విరాట్ కోహ్లి వ్యక్తిగత స్కోర్ 34 పరుగుల వద్ద ఈ ఏడాది వెయ్యి పరుగుల మార్క్‌ను అందుకొని టీమిండియా తరఫున అత్యధికసార్లు ఒక ఏడాదిలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న సచిన్(11) సరసన నిలిచాడు.
వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో గురువారం జరిగిన గ్రూప్ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 302 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 357పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక జట్టు 19.3ఓవర్లలో 55పరుగులకే కుప్పకూలింది. షమీ(5/18), సిరాజ్(3/16) బౌలింగ్‌లో మెరిసారు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్‌కు తొలి ఓవర్లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(4) ఔటయ్యాడు. మధుశంక వేసిన రెండో బంతికి రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (92), విరాట్ కోహ్లీ(88) అర్ధసెంచరీలతో మెరిసారు.
వీరిద్దరూ కలిసి 2వ వికెట్‌కు 189పరుగులు జతచేశారు. వీరు రన్ రేట్ 6కు తగ్గకుండా ఆడారు. అయితే సెంచరీలకు చేరువవుతున్న క్రమంలో మధుశంక భారత్‌కు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. 30వ ఓవర్లో గిల్‌ను ఔట్ చేసిన మధుశంక.. మరుసటి ఓవర్లో కోహ్లీని కూడా పెవిలియన్‌కు పంపాడు.
ఆ తర్వాత కెఎల్ రాహుల్(21), శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి నాల్గో వికెట్‌కు 60 పరుగులు జోడించాడు. 40వ ఓవర్లో ఛమీరా బౌలింగ్‌లో హేమంతకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్‌కు చేరాడు. ఆ సమయానికి భారతజట్టు స్కోర్ 5వికెట్ల నష్టానికి 276పరుగులు. టి20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్(12) పేలవ ఫామ్ మరోసారి కొనసాగింది.
చివర్లో శ్రేయాస్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కసున్ రజిత వేసిన 36వ ఓవర్లో భారీ సిక్సర్ బాదిన అయ్యర్.. తీక్షణ వేసిన 41వ ఓవర్లో లాంగాఫ్ మీదుగా అద్భుతమైన సిక్స్ కొట్టాడు. 36 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసిన అయ్యర్.. మధుశంక వేసిన 48వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు మూడోబంతినీ సిక్సర్ కొట్టేందుకు ప్రయత్నించి తీక్షణ చేతికి చిక్కాడు. చివర్లో రవీంద్ర జడేజా (35) ధాటిగా ఆడటంతో భారత్ 350 పరుగుల మైలురాయిని దాటింది. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంకకు ఐదు, ఛమీరాకు ఒక వికెట్ దక్కాయి.
భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు పరుగుల ఖాతా తెరవకుండానే నిస్సంక(0) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కరుణరత్నే, సమరవిక్రమ కూడా పరుగుల ఖాతా తెరవకుండానే పెవీలియన్‌కు చేరడంతో లంక జట్టు 2పరుగులకే 3వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత టీమిండియా పేసర్లు షమీ, సిరాజ్ వరుసగా వికెట్లు తీయడంతో లంక జట్టు 29పరుగులకే 8వికెట్లు కోల్పోయి ఓటమికోరల్లో నిలిచింది. చివరి రెండు వికెట్లకు లంక 26పరుగుల జతచేయడంతో ఊపిరి పీల్చుకుంది. బుమ్రా(1/8), జడేజా(1/4)కి తోడు షమీకి ఐదు, సిరాజ్‌కు మూడు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మహ్మద్ సిరాజ్‌కు లభించింది.