ఆంధ్రప్రదేశ్‌లో కులగణనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. నవంబరు 15 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. ఎస్ఐపీబీ ప్రతిపాదనలతో పాటు రూ. 19 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటు, సమగ్ర కుల గణన, ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీకి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది.
ప్రతి జర్నలిస్ట్‌కు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. జగనన్న సురక్ష కార్యక్రమానికి ఆమోదం తెలిపారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు ఆరోగ్యశ్రీపై మరోసారి అవగాహన కార్యక్రమం, 6, 790 ప్రభుత్వ స్కూళ్లలో ఫ్యూచర్ స్కిల్స్‌పై బోధన, టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేనికి గ్రూప్-1 ఉద్యోగం, ఫెర్రోఅలైస్ కంపెనీలకు ఎలక్ట్రిసిటీ చార్జీలు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
రోడ్లు, భవనాల శాఖలో ఔట్ సోర్సింగ్ పద్దతిలో 467 పోస్టుల భర్, వ్యవసాయ, సహకార శాఖకు రూ. 5వేల కోట్లకు గ్యారంటీ ఇస్తూ మార్క్ ఫెడ్ ద్వారా రుణం, మార్కాపూర్ మెడికల్ కాలేజీలో కొత్తగా 21 పోస్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అలాగే, పోలవరం నిర్వాసితుల ఇళ్ళ పట్టాలు, స్థలాల రిజిస్ట్రేషన్లకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీల మినహాయింపు నిర్ణయానికి ర్యాటిఫై చేసింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆర్డర్ డ్రాఫ్ట్ – 2023 కు ఆమోదం తెలిపింది.