దేశంలోని వివిధ బ్యాంకుల నుండి రుణాలను తీసుకుని, ఎగ్గొడుతూ రూ 1,626 కోట్ల మేరకు కుంభకోణంకు పాల్పడినట్లు దేశంలో ప్రముఖ ప్రైవేట్ యూనివర్సిటీ అయిన అశోక యూనివర్శిటీ వ్యవస్థాపకులు వినీత్ గుప్తా, ప్రణవ్ గుప్తాలపై సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. చండీఘర్‌కు చెందిన పార్మాసూటికల్ కంపెనీ పారాబోలిక్ డ్రగ్స్‌కు సంబంధించిన ఈ కుంభకోణంపై దర్యాప్తు జరిపింది.
ఫార్మా సంస్థ, ప్రణవ్, వినీత్ గుప్తాలతో పాటు మరో 10 మందిపై సిబిఐ కేసు నమోదు చేసింది. వీరంతా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మరో 11 బ్యాంకులను మోసగించారని తెలిపింది. గత నెల 31 పలు నగరాల్లో గుప్తాలకు చెందిన ప్రాంగణాల్లో సోదాలు చేపట్టగా పత్రాలు, ఆర్టికల్స్, రూ. 1.58 కోట్ల విలువ చేసే నగదును స్వాధీనం చేసుకున్నామని సిబిఐ పేర్కొంది.
గుప్తాలపై ఫోర్జరీ, నేరపూరిత కుట్ర వంటి అభియోగాలు నమోదు చేశారు. అశోక యూనివర్శిటీ వెబ్ సైట్లో వినీత్ గుప్తా వ్యవస్థాకుడు, ట్రస్టీగా, ప్రణావ్ గుప్తా సహ వ్యవస్థాపకులు, ట్రస్టీగా పేర్కొనబడి ఉంది. 1996లో ఏర్పాటు చేసిన పారాబోలిక్ డ్రగ్స్‌ను గుప్తా బ్రదర్స్ ప్రమోట్ చేశారు. రుణాలు చెల్లించడం లేదంటూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేయగా.. సిబిఐ విచారణ చేపట్టింది.
సిబిఐ విచారణలో పారాబోలిక్.. నకిలీ డాక్యుమెంట్లతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యుఎస్‌ఒ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, ఐసిఐసిఐ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎగ్జిమ్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎస్ఐడిబిఐ వంటి నుండి రుణాలను పొందారు.