హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం 2023-2024 ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కూటమి ఆఫిస్ బేరర్స్ పోస్టులను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసి ఎబివిపి కూటమిపై ఘన విజయం సాధించింది.
అధ్యక్ష స్థానానికి మహ్మమద్ అతిక్ అహ్మద్ (ఎస్ఎఫ్ఐ) -1880, షేక్ ఆయేషా (ఎబివిపి) -1409, ఉమేష్ అంబేద్కర్ (ఏ ఎస్ డి) -424, అమల్ జోష్ ఫిలిప్ (ఎన్ ఎస్ యు ఐ) -345, ఓట్లు పోందగా 471 ఓట్ల మెజారిటీతో ఎస్ఎఫ్ఐఅభ్యర్థి మహ్మమద్ అతిక్ అహ్మద్ అధ్యక్షుడిగా గెలుపోందారు.
ఉపాధ్యక్ష స్థానానికి జలి ఆకాష్( ఎస్ఎఫ్ఐ కూటమిలో భాగస్వామి ఎఎస్ ఎ)- 1671, తరుణ్ (ఎబివిపి) -1283, రనియా జులైక ( ఏ ఎస్ డి ) – 729, ముకుంద్ కుమార్ (ఎన్ ఎస్ యు ఐ) -253 ఉపాధ్యక్ష స్థానంలో ఎస్ఎఫ్ఐ కూటమి అభ్యర్థి జలి ఆకాష్ 388 ఓట్ల మెజారిటీ తో గెలుపోందారు.
ప్రధాన కార్యదర్శి స్థానానికి దీపక్ కుమార్ ఆర్య (ఎస్ఎఫ్ఐ కూటమిలో భాగస్వామి ఎఎస్ ఎ అభ్యర్థి) -1765, రాజేష్ పిల్లా (ఎబివిపి) -1285, అంజి (ఏ ఎస్ డి) -432, శ్రీరామ్ యాదవ్ (ఎన్ ఎస్ యు ఐ) -384 ప్రధాన కార్యదర్శి స్థానంలో దీపక్ కుమార్ ఆర్య 480 ఓట్ల మెజారిటీ ఓట్లతో గెలుపోందారు.
సహాయ కార్యదర్శి స్థానానికి లావుడి బాలంజనేయులు (ఎస్ఎఫ్ఐ కూటమిలో భాగస్వామి టి ఎస్ ఎఫ్ అభ్యర్థి) – 1775, రాథోడ్ వసంత్ కుమార్ (ఎబివిపి) – 1134, శక్తి రజ్వార్ (ఏ ఎస్ డి) -421, చందన్ ధావర్ (ఎన్ ఎస్ యు ఐ) -296, సహాయ కార్యదర్శి స్థానంలో లావుడి బాలంజనేయులు 641 ఓట్ల మెజార్టీతో గెలుపోందారు.