సమాజంలో వని అల్ప ఆదాయ ర్గాలకు అదనపు ఆదాయ అవకాశాలను కల్పించడంతో పాటు, స్థానిక/స్వదేశీ ఉత్పత్తులకు మార్కెట్‌ను అందించడం, వాటిని ప్రోత్సహించడానికి భారతీయ రైల్వే ప్రారంభించిన నూతన చొరవతో ‘ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి’ పథకంకు దక్షిణ మధ్య రైల్వేలో విస్తృతంగా ప్రజాదరణ పొందుతుంది.
తెలంగాణలోని 41 స్టాళ్ల ద్వారా 1435, ఆంధ్రప్రదేశ్‌లోని 56 స్టాళ్ల ద్వారా 1960, మహారాష్ట్రలోని 20 స్టాల్స్ నుండి 700, కర్ణాటకలోని 03 స్టాల్స్ నుండి 105 మంది, మొత్తం వెరసి 120 ‘ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి’ స్టాల్స్ ద్వారా దాదాపు 4200 మంది ప్రత్యక్ష లబ్ధిదారులు వ్యాపార అవకాశాలను పొందుతున్నారు.
స్థానిక ప్రజల నుండి అపారమైన స్పందన రావడం వలన ఇప్పుడు, 109 రైల్వే స్టేషన్లలో 120 స్టాళ్లతో ‘ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి’ స్టాల్స్ నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని సికింద్రాబాద్ , హైదరాబాద్, కాచిగూడ , వరంగల్, నిజామాబాద్ , గద్వాల్ మొదలైన 33 రైల్వే స్టేషన్ లలో , ఒక స్టేషన్ ఒక ఉత్పత్తితో కూడిన 41 స్టాల్స్ ఏర్పాటు ద్వారా స్థానిక చేతివృత్తుల వారి జీవనోపాధి, సంక్షేమానికి పెద్ద ప్రోత్సాహాన్నికలిగిస్తున్నారు.
ఇందులో కొన్ని ఉత్పత్తులలో సాంప్రదాయ నారాయణపేట, గద్వాల్, పోచంపల్లి చీరలు వంటి స్థానిక నేత కార్మికులు చేనేత వస్త్రాలు ఉన్నాయి. మిల్లెట్ ఆధారిత ఆహార ఉత్పత్తులు; టిస్కో చేనేత, భద్రాచలం వెదురు ఉత్పత్తులు ; ఆలయ దేవతా విగ్రహాలు; అటవీ సేకరణలు చేతిపనుల బొమ్మలు; నిర్మల్ బొమ్మలు, స్థానిక రుచికరమైన వంటకాలు మొదలైనవి లభిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, తిరుపతి , కర్నూలు, గుంటూరు, అనంతపురం , నెల్లూరు మొదలైన 53 రైల్వే స్టేషన్ లలో 56 స్టాల్స్‌లో లభిస్తున్న ఉత్పత్తులలో జనపనార ఉత్పత్తులు, కలంకారి ఉత్పత్తులు, ఏటికొప్పాక బొమ్మలు, చెక్కతో తయారు చేసిన వస్తువులు , మిల్లెట్ ఆధారిత మొదలైనవి లభ్యమౌతున్నాయి.
మహారాష్లోని, నాందేడ్ , ఔరంగా బాద్ , హిమాయత్‌నగర్ , నాగర్సోల్ , ముద్ఖేడ్ మొదలైన వాటితో సహా 20 రైల్వే స్టేషన్ లలోని 20 స్టాల్స్‌లో చేనేత ఉత్పత్తులు, చాపలు, రాజ్గిరా లడ్డూ , జొన్నపిండి , పాపడ్స్ మొదలైనవి ఉన్నాయి. కర్నాటకలోని బీదర్ , యాద్గిర్, రాయచూర్ రైల్వే స్టేషన్ లలో ఉత్పత్తులలో చేనేత చీరలు, బిద్రి హస్తకళలు, చేతితో తయారు చేసిన ఆభరణాలు మొదలైన ఉత్పత్తులు ఉన్నాయి.
భారతీయ రైల్వేలు ఈ పథకం కింద స్వదేశీ/స్థానిక ఉత్పత్తులను ప్రదర్శించడం, విక్రయించడం, అధిక దృశ్యమానతను అందించడం కోసం ఎన్.ఐ.డి./అహ్మదాబాద్ రూపొందించిన డిజైన్ ప్రకారం స్టేషన్లలో విలక్షణమైన రూపం, అనుభూతి, లోగోతో ప్రత్యేకంగా రూపొందించిన విక్రయ కేంద్రాలను అందిస్తోంది.
స్టేషన్లలో లాట్ల డ్రా ద్వారా రొటేషన్ ప్రాతిపదికన పథకం లక్ష్యాలను చేరుకునే టెండరింగ్ ప్రక్రియ ద్వారా దరఖాస్తుదారులందరికీ కేటాయింపు జరుగుతుంది. స్థానిక కళాకారులు, చేనేత కార్మికులు, హస్తకళాకారులు, తెగలు ద్వారా తయారు చేసిన కళాఖండాలు, హస్తకళలు, వస్త్రాలు, చేనేత వస్త్రాలు, బొమ్మలు, తోలు ఉత్పత్తులు, సాంప్రదాయ ఉపకరణాలు / సాధనాలు, వస్త్రాలు, రత్నాలు, ఆభరణాల మొదలైన ఉత్పత్తుల వర్గీకరణ స్థానికంగా ఉంటుంది/ ఆ ప్రదేశానికి చెందినవిగా ఉంటాయి.
ఈ ఉత్పత్తులలో ప్రాసెస్ చేయబడిన, సెమీప్రాసెస్డ్, దేశీయంగా తయారు చేయబడిన/ప్రాంతంలో పండించబడిన ఇతర ఆహార ఉత్పత్తులు మొదలైనవి లభ్యమవుతాయి. స్థానిక నైపుణ్యం, హస్తకళలో నిమగ్నమైన స్థానిక యువతకు రైల్వే అందించిన ఈ అవకాశాలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్పిలుపునిచ్చారు.