కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ తిరుపతి జిఎస్టి కమిషనరేట్‌లోని జిఎస్టి భవన్‌కు గురువారం భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా వర్చువల్ గా ప్రసంగించారు. కొత్త జిఎస్టి భవన నిర్మాణం ద్వారా మౌలిక సదుపాయాల ఏర్పాటు, పన్ను నిర్వహణలో సామర్థ్యాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ఈ చర్య ప్రతిబింబిస్తుంది.
ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ పన్ను చెల్లింపుదారులకి అనుకూలమైన సులభతర పద్దతులను మెరుగు చేయవలసిన అవసరాన్ని ఎత్తిచూపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జిఎస్టి సేవా కేంద్రాల ద్వారా బయోమెట్రిక్ ఆధారిత ఆధార్ ప్రమాణీకరణకు ఆమోదం లభించిందని ఆమె ప్రకటించారు.
తిరుపతి కమిషనరేట్‌కు జీఎస్టీ ఆదాయం రూ. 8,264 కోట్లు, గతేడాది సెప్టెంబరు 2023 వరకు రూ. 5,019 కోట్లు మాత్రమే . కమిషనరేట్ ఇటీవలి కొన్ని సంవత్సరాలలో జిఎస్టి విధానంలో 300% ఆకట్టుకునే వృద్ధిని నమోదు చేస్తూ చాలా పురోగతిని సాధించింది. ఈ అద్భుతమైన పురోగతికి ప్రధాన కారణం ప్యాసింజర్ వాహనాలు, సిమెంట్ ; ఆటోమోటివ్ బ్యాటరీల తయారీ పరిశ్రమల వృద్ధి అని ఆమె వివరించారు.
