2022లో ఆగ్నేయాసియా ప్రాంతంలో 66 శాతం మలేరియా కేసులు భారతదేశంలేనే నమోదు అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) ప్రచురించిన ప్రపంచ మలేరియా నివేదిక – 2023లో పేర్కొంది.
వీటిలో దాదాపు 46 శాతం ప్లాస్మోడియం వైవాక్స్ వల్ల సంభవించాయని తెలిపింది. దోమ తెరలు, మందులు వినియోగించడం ద్వారా చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలలో మలేరియాను నివారించడంలో సహాయపడతాయని తెలిపింది. ఆగ్నేయాసియా ప్రాంతంలో 77 శాతం మరణాలు తగ్గాయని తెలిపింది.
కాగా ఆగ్నేయాసియాలోని మొత్తం మలేరియా మరణాలలో 94 శాతం మరణాలు భారతదేశం,ఇండోనేషియాలో ఉన్నాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 2019లో 233 మిలియన్ల మలేరియా కేసులు నమోదు కాగా, 2022లో 249 మిలియన్ కేసులు చేరుకున్నాయి. 2019 కంటే 2022లో 16 మిలియన్ కేసులు పెరిగాయని నివేదిక పేర్కొంది.
కోవిడ్-19, మాదకద్రవ్యాలు మరియు పురుగుమందుల నిరోధకత, మానవతా సంక్షోభాలు, వనరుల పరిమితులు, వాతావరణ మార్పుల ప్రభావాలు వంటివి మలేరియాపై పోరాటానికి ఆటంకం కలిగిస్తున్నాయని పేర్కొంది. 2016 నుండి నేటి వరకు శ్రీలంక మలేరియా రహిత దేశంగా కొనసాగుతుందని తెలిపింది.