తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తీవ్ర గాయంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో పంచె తగిలి కాలుజారి పడటంతో కేసీఆర్‌కు తీవ్ర గాయమైనట్లు సమాచారం. దీంతో గురువారం అర్ధరాత్రి యశోద ఆస్పత్రిలో ఆయనను చేర్చారు.
కేసీఆర్ ఎడమ కాలి ఎముక విరిగినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌కు చికిత్స అందిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొన్ని పరీక్షలు నిర్వహించారు.. శుక్రవారం కొన్ని పరీక్షలు నిర్వహించనున్నారు.
శస్త్రచికిత్స నిర్వహించాల్సి రావొచ్చని భావిస్తున్నారు. అయితే వైద్య పరీక్షలు పూర్తయ్యాక శస్త్రచికిత్సపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గత ఆదివారం ఓట్ల లెక్కింపులు తమ పార్టీ బిఆర్ఎస్ ఓటమి దిశగా పయనిస్తున్నట్లు తెలియగానే ఆయన మధ్యాన్నం ముఖ్యమంత్రి నివాసం ప్రగతి భవన్ నుండి ఫార్మ్ హౌస్ కు వెళ్లిపోయారు. అప్పటి నుండి అక్కడే ఉంటున్నారు. నిత్యం ఆయన మద్దతుదారులు, పార్టీ నేతలు కలుస్తున్నారు.