తెలంగాణ మాజీ సిఎం, బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌కు సర్జరీ సక్సెస్ అయింది. సోమాజీగూడలోని యశోద హాస్పిట ల్ వైద్యులు మాజీ సిఎం కెసిఆర్‌కు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. శుక్రవారం సాయం త్రం ప్రారంభమైన తుంటి ఎముక మార్పిడి సర్జరీ గత రాత్రి పూర్తియింది. సర్జరీ పూర్తయిన అనంతరం కెసిఆర్‌ను ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసియుకి తరలించారు.
కెసిఆర్ సతీమణి శోభ కుమారుడు కెటిఆర్, కుమార్తె కవిత, హరీశ్‌రావు, సంతోష్ తదితరులు యశోద హాస్పిటల్ లో ఉండి కెసిఆర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో కెసిఆర్ బాత్రూమ్లో కాలు జారిపడిపోయారు. ఘటన జరిగిన వెంటనే ఆయన్ని యశోద హాస్పిటల్‌కు తరలించారు.
అర్థరాత్రి రెండున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కెసిఆర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని వై ద్య, ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. కెసిఆర్‌కు మె రుగైన వైద్య సహాయం అందించాలని వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వికి సూచించారు.
సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు యశోద హాస్పిటల్‌కు వైద్య, ఆరోగ్య శాఖ సెక్రటరీ రిజ్వీ వెళ్లారు. యశోద ఆసుపత్రి వైద్యులను అడిగి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆసుపత్రి వై ద్యులు ప్రకటించారు. ఈ గాయం నుండి కోలుకోవడానికి ఆయనకు ఆరు నుండి ఎనిమిది వారాల సమయం పడుతుందని యశోద ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.
కెసిఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పలువురు సందేశాలు పంపారు. మాజీ సిఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా స్పందించారు. కెసిఆర్‌కు అయిన గాయం గురించి తెలిసి చాలా బాధప డినట్టు తెలిపారు. ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఎపి సిఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు ఫోన్ చేసి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
కెసిఆర్ త్వరగా కోలుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆకాక్షించారు. కెసిఆర్‌కు గాయమైందని తెలిసి బాధపడ్డానని పేర్కొన్నారు. ఆయన సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నానని పేర్కొన్నారు.