గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖకు సంబంధించిన మూడు కీలక అంశాలపైన న్యాయ విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో టెండర్లు లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం, కాలం చెల్లిన సాంకేతికతతో నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాలపైన న్యాయవిచారణ జరిపించనున్నట్టు వెల్లడించారు.
గురువారం శాసనసభలో ప్రభుత్వం విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ అంశంపై చర్చలో భాగంగా విద్యుత్‌శాఖ మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎంఎల్ఎ జగదీశ్‌రెడ్డి గత ప్రభుత్వంలో అవకతవలకు అక్రమాలు జరిగివుంటే సిట్టింగ్ జడ్జిచేత న్యాయవిచారణ చేసుకోవచ్చని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జగదీశ్‌రెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు వెల్లడించారు.A R
జ్యుడిషియరీ విచారణ మంచి సూచన అని ఇలాంటివి ఇవ్వమని కోరుతున్నామని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ ఒప్పందంపై ఆనాడే తాము సభలో పోరాటం చేస్తే.. మార్షల్స్ తో తమ ను సభ నుంచి బయటకు పంపారని గుర్తు చేశారు. ఛత్తీస్‌గఢ్ ఒప్పందం పై ఓ అధికారి నిజాలు చెప్తే ఆ ఉద్యోగికి డిమోషన్ ఇచ్చి మారుమూల ప్రాంతాలకు పంపారని ధ్వజమెత్తారు.
ఛత్తీస్‌గఢ్‌తో 1000 మెగావాట్ల ఒ ప్పందం చేసుకున్నారన్నారని, ఈ ఒప్పందం వల్ల ప్రభుత్వం పై రూ.1362 కోట్ల భారం పడిందని వెల్లడించారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో వేలకోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీకి కాలం చెల్లినా దాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి నష్టం చేశారు.
24 గంటల కరెంట్ పై అఖిల పక్షంతో నిజనిర్ధారణ కమిటీ వేద్దాం అని వెల్లడించారు. శ్వేతపత్రంలో వాస్తవాలు వివరించామని చెబుతూ .ప్రతిపక్షం తప్పిదాలు కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేసిందని, ఇటువంటి చర్యలు రాష్ట్రానికే నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు. గత తొమ్మిదేళ్ల లో ప్రభుత్వ నిర్ణయాలు ఫలితాలు దుష్పలితాలు సభ ముందు పెట్టామని పేర్కొన్నారు.
యాదాద్రి ధర్మల్ స్టేషన్ నిర్మాణంలో పనికిరాని పాత దుస్తులు, ఔట్‌డేటెడ్ సెల్పోన్లు తీ సుకున్నట్టు అప్పటికే కాలం చెల్లిన సబ్‌క్రిటికల్ టెక్నాలజి వాడారని విమర్శించారు. కా లుష్యం లేని విధంగా పర్యావరణాన్ని కాపాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధునాతన సూపర్ క్రిటికల్ టెక్నాలజిని వాడాలని ఆదేశించినా పట్టించుకోలేదని మండిపడ్డారు.
గత ప్రభుత్వ చర్యలతో విద్యుత్ రంగంలో రూ. 81,516 కోట్ల అప్పులు ఉన్నట్లు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అసెంబ్లీలో విద్యుత్ రంగంపై చర్చకు సమాధానమిస్తూ రాష్ట్రం ఏర్పడేనాటికి జెన్కో అప్పులు రూ.7,662 కోట్లు ఉంటే, ప్రస్తుతం రూ. 32,797 కోట్లకు పెరిగిందని తెలిపారు. విద్యుత్ శాఖలో ఆస్తులు పెంచితే డిస్కం నికర విలువ 2021- 22 నాటికి మైనస్ రూ. 30,876 కోట్లకు ఎలా వెళ్ళిందని ప్రశ్నించారు.