వాస్తవాధీన రేఖ వద్ద లఢఖ్‌కు చెందిన గొర్రెల కాపరులను చైనా సైనికులు అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చైనా సైనికులు గొర్రెల కాపరులను వాస్తవ నియంత్రణ రేఖ వద్ద గొర్రెలను మేపకుండా ఆపేందుకు యత్నించడం కనిపించింది. చైనా సైన్యానికి లఢక్ వాసులు సైతం నిర్భంగా ప్రతిస్పందిస్తున్నారు.
చైనా సైనికులతో వాగ్వాదానికి దిగుతూ తాము భారత భూభాగంలో ఉన్నామంటూ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. ఈ వీడియోలో ఉన్నది తూర్పు లడఖ్‌కు చెందిన వారిగా సమాచారం. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారత భద్రతను పెంచింది. గత మూడు సంవత్సరాల్లో తూర్పు లడఖ్‌లో స్థానిక పశువుల కాపరులు మూడేళ్లుగా తమ పశువులను మేపడం మానేశారు.
తాజాగా ఈ ప్రాంతంలో మేపుతుండగా.. చైనా సైనికులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే, తమ ప్రాంతంలోనే ఉన్నామని స్థానికులు గట్టిగా చెప్పడం చైనా దళాలు తొలిసారిగా వెనక్కి వెళ్లిపోవడం ఇదే తొలిసారి. చుషుల్ కౌన్సిలర్ కొంచోక్ స్టాంజిన్ పశువుల కాపరులను అభినందించారు. వారికి మద్దతు తెలుపుతున్న సైన్యాన్ని ప్రశ్నించారు. బలమైన పౌర, సైనిక సంబంధాలను కొనసాగిన్నందుకు, సరిహద్దు ప్రాంతంలో జనాభా ప్రయోజనాలను పరిరక్షిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.