కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం నాలుగు కులాలకు ప్రాధాన్యమిచ్చిందని తెలిపారు. పేదలు, మహిళలు, యువత, అన్నదాతలను శక్తిమంతం చేసే ప్రయత్నం చేసిందని తెలిపారు. పేదరిక నిర్మూలనకు బహుముఖి అయిన విధానాలతో ఈ ప్రభుత్వం పని చేసిందని వెల్లడించారు.
రూ.34 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ పథకంతో పేదలకు జన్‌ధన్ ఖాతాల ద్వారా అందించిందని ఆమె వివరించారు. పేదరిక నిర్మూలనకు బహుముఖీయ విధానాలతో ప్రభుత్వం పనిచేసిందని చెబుతూ సబ్కా సాథ్ లక్ష్యంతో గత పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలను వివిధ రకాల పేదరికం నుంచి బయటపడేశామని వెల్లడించారు.
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం, దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యాన్ని క్లిష్టతరం చేస్తున్నాయని తెలిపారు. అనేక కొత్త సవాళ్ల మధ్య భారత్ నూతన మార్గాన్ని అన్వేషిస్తోందని వెల్లడించారు. పశ్చిమాసియా, యూరప్‌లో ఉన్న యుద్ధ వాతావరణం కొత్త సవాళ్లను మన ముందుంచిందని పేర్కొన్నారు. సవాళ్లను ఎదుర్కొని ప్రపంచాన్ని కొత్త మార్గంలో వెళ్లే దిశగా భారత్ సుదృఢమైన పాత్రను పోషిస్తోందని ఆమె వివరించారు.
భారత్‌ను 2047 నాటికి వికసిత భారత్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె చెప్పారు. మోడీ సర్కార్‌కు చెందిన చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమె మాట్లాడుతూ దేశ ప్రజల సగటు ఆదాయం 50 శాతం పెరిగినట్లు తెలిపారు. గడిచిన పదేళ్లలో మహిళల సాధికారత పెరిగిందని, ట్రిపుల్ తలాక్‌ను చట్టరీత్యా నేరం చేశామని పేర్కొన్నారు.
ప్రభుత్వ స్కీమ్ కింద 70 శాతం మంది మహిళలకు ఇండ్లు అందజేసినట్లు చెప్పారు. అన్ని రకాల మౌళికసదుపాయాల్ని రికార్డు సమయంలో క్రియేట్ చేస్తున్నట్లు తెలిపారు. భారత అభివృద్ధిలో దేశంలోని అన్ని ప్రాంతాలు భాగస్వామ్యం అవుతున్నాయన్నారు. వన్ నేషన్ వన్ మార్కెట్ వల్ల ద్రవ్యోల్బణం అదుపులో ఉందన్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం మహిళల సంఖ్య పెరిగిందన్నారు.
కోవిడ్-19 తర్వాత తగ్గుముఖం పట్టిన హౌసింగ్ రంగాన్ని పునరుద్ధరించేందుకు హౌసింగ్ రంగ బడ్జెట్ చర్యలు తీసుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ రంగానికి చెందిన వారు మొదటిసారిగా ఇల్లు కొనుగోలు చేసేవారికి పన్ను మినహాయింపులతో సహా ప్రకటనలను డిమాండ్ చేస్తున్నారు.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం హౌసింగ్ లోన్ వడ్డీపై పన్ను రాయితీని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడం వల్ల హౌసింగ్ మార్కెట్ వృద్ధి చెందుతుందని వారు చెబుతున్నారని ఆర్ధికమంత్రి తెలిపారు. కోవిడ్ కారణంగా 2023లో అమ్మకాలు 20% పడిపోయిన సరసమైన గృహాల కోసం డిమాండ్‌ను పెంచడంలో ఇది సహాయపడుతుందని ఆమె చెప్పారు.
దశల వారీగా సమయోచితంగా రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కరెంటు కష్టాలు లేని దేశం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టిబడి ఉందని తెలిపారు. దేశంలో కోటీ ఇండ్లపై రూఫ్ ఆఫ్ సోలార్ సెట్ అప్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ప్రతి ఇంటికి 300యూనిట్ల సోలార్ విద్యుత్ ఉచితంగా అందిస్తామని ఆమె బడ్జెట్లో ప్రకటన చేశారు. దీంతో ప్రతి కుటుంబానికి ఏటా 15 వేల నుంచి 18 వేల రూపాయలు ఆదా అవుతుందని వివరించారు. వినియోగం పొగ మిగిలిన విద్యుత్తును పంపిణీ సంస్థలకు విక్రయించవచ్చని తెలిపారు.
దశల వారీగా సమయోచితంగా రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కరెంటు కష్టాలు లేని దేశం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టిబడి ఉందని తెలిపారు. దేశంలో కోటీ ఇండ్లపై రూఫ్ ఆఫ్ సోలార్ సెట్ అప్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి ఇంటికి 300యూనిట్ల సోలార్ విద్యుత్ ఉచితంగా అందిస్తామని బడ్జెట్లో ప్రకటన చేశారు నిర్మల సీతారామన్. దీంతో ప్రతి కుటుంబానికి ఏటా 15 వేల నుంచి 18 వేల రూపాయలు ఆదా అవుతుందని వివరించారు. వినియోగం పొగ మిగిలిన విద్యుత్తును పంపిణీ సంస్థలకు విక్రయించవచ్చని తెలిపారు.