మూడు దశాబ్దాల తర్వాత భారతదేశం ప్రపంచ సుందరి(మిస్ వరల్డ్) 71వ ఎడిషన్ పోటీలకు వేదిక కానుంది. భారత్లో ఈ నెల 18 నుంచి మార్చి 9 వరకు ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు భారత్ ప్రపంచ దేశాల నుంచి వచ్చే సుందరీ మణులకు ఆతిథ్యం ఇవ్వబోతున్నదని తెలుస్తుంది.
ఇందులో ప్రస్తుత మిస్ వరల్డ్ తో పాటు నలుగురు మాజీ విజేతలు పాల్గొని కీలక విషయాలను వెల్లడించారు. 70వ ఎడిషన్ విన్నర్ కరోలినా బిలావ్స్కా, టోనీ అండ్ సింగ్ 69వ ప్రపంచ సుందరి, వెనెస్సా పోన్స్ డీ లియోన్ 68వ ప్రపంచ సుందరి, మానుషి చిల్లర్ 67వ ప్రపంచ సుందరి, స్టెఫానీ డెల్ వల్లే 66వ ప్రపంచ సుందరి ఈ సందర్భంగా ఢిల్లీకి వచ్చారు.
ఇక మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్, సీఈవో అయిన జూలియా మోర్లీ సీబీఈ మాట్లాడుతూ భారతదేశం పట్ల తనకున్న ప్రేమ ఎనలేనిదని, ఇక్కడ 71వ ఎడిషన్ ప్రపంచ సుందరి పోటీలను నిర్వహించడం తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. ప్రపంచ సుందరి పోటీల ద్వారా భారతదేశాన్ని ,అందమైన ప్రదేశాలను ప్రపంచ దేశాలకు తెలియజేయాలని కోరుకుంటున్నామని తెలిపారు.
ప్రపంచంలోని అన్ని దేశాలు భారతదేశాన్ని, ప్రపంచ సుందరి పోటీలను చూడడానికి రావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచంలో నలుమూలల నుండి ఇక్కడికి వచ్చే వారికి తాము ప్రపంచ ప్రసిద్ధ ఆతిథ్యాన్ని ఇస్తామని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ సీఈవో జూలియా మోర్లీ ప్రకటించారు.
మిస్ వరల్డ్ పోటీలలో భాగంగా ఈ సంవత్సరం కూడా పోటీదారులు ఫ్యాషన్ షో, టాలెంట్ కాంపిటీషన్ వంటి సాంప్రదాయ రౌండ్ లతోపాటు న్యాయ నిర్ణేతలు అడిగే వివిధ ప్రశ్నలకు తమ సమాధానాలతో జస్టిఫికేషన్ ఇస్తారు.