గతేడాది భారత్‌కు రెండు ఐసీసీ ట్రోఫీలను దూరం చేసిన (సీనియర్ స్థాయిలో) ఆస్ట్రేలియా తాజాగా జూనియర్ లెవల్లో కూడా దెబ్బకొట్టింది. 2023 జూన్‌లో పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆసీస్.. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో రోహిత్ సేనను చిత్తు చేసింది.
మళ్లీ నవంబర్‌లో భారత్‌లోనే జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో కూడా అసలు ఓటమన్నదే లేకుండా ఫైనల్ చేరిన భారత జట్టును ఓడించి ప్రపంచకప్ ఎగురేసుకుపోయింది. తాజాగా పెద్దలు (రోహిత్ సేన) చూపిన బాటలోనే ఉదయ్ సహరన్ సారథ్యంలోని యువ భారత్ పయనించింది.
ఫైనల్ దాకా ఓ రేంజ్ ఆట ఆడిన టీమిండియా.. తుదిపోరులో యావరేజ్ ఆట కూడా ఆడలేక చతికిలపడింది. ఫలితంగా దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్ – 19 మెన్స్ వరల్డ్ కప్‌లో కంగారూలు.. భారత్‌ను ఓడించి విశ్వవిజేతలుగా నిలిచారు.
ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా ఫైనల్‌కు వచ్చిన మన కుర్రాళ్లు.. తుది పోరులో బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించినా బ్యాటింగ్‌లో విఫలమై ఆరో టైటిల్‌ను అందుకునే అవకాశాన్ని చేజేతులా వదులుకున్నారు. ఫైనల్లో ఆసీస్ నిర్దేశించిన 254 పరుగుల ఛేదనలో యువ భారత్.. 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఆసీస్.. 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ విజేతగా నిలిచింది.
దక్షిణాఫ్రికా విల్లోమూరే పార్క్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు విజయాన్ని సొంతం చేసుకుంది. భారత జట్టుపై 79 పరుగుల తేడాతో గెలుపొంది టోర్నీ టైటిల్‌ను దక్కించుకుంది. ఈ టోర్నీ ఇప్పటి వరకు 15 సార్లు నిర్వహించగా ఈ విజయంతో అండర్ 19 ప్రపంచకప్ టైటిల్‌ను నాలుగుసార్లు గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా అవతరించింది.
కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో హర్జాస్ సింగ్ (55), కెప్టెన్ హ్యూగ్ వీబ్గన్ (48), హ్యారీ డిక్సాన్ (42)లతో పాటు ఆఖర్లో ఒలీవర్ పీక్ (46 నాటౌట్) రాణించారు.
ఇక చేజింగ్‌కు వచ్చిన భారత్ జట్టు ఆదిలోను కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 44 ఓవర్లలో 174 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది భారత జట్టు. భారత బ్యాట్స్మెన్లలో ఓపెనర్ ఓపెనర్ ఆదర్శ్ సింగ్ అత్యధికంగా 47 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మురుగన్ అభిషేక్ 42 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
భారత బౌలర్లలో రాజ్ లింబాని మూడు వికెట్లు , నమన్ తివారి 2 వికెట్లతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో మహ్లీ బార్డ్‌మాన్, రాఫెల్ మాక్మిలన్ మూడు వికెట్లు తీయగా.. కల్లమ్ విడ్లర్ రెండు వికెట్లు తీసాడు. చార్లీ ఆండర్సన్, టామ్ స్ట్రాకర్ చరో వికెట్ దక్కించుకున్నారు.